TTD: తిరుమల శ్రీవారిసేవ పేరుతో టికెట్లు విక్రయించిన వ్యక్తి అరెస్టు

తిరుమల శ్రీవారి సేవ టికెట్లు అంటూ సుపథం ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను అధిక ధరకు విక్రయించి.. భక్తులను మోసం చేసిన  వ్యక్తిని అరెస్టు చేశామని తిరుమల ఏఎస్పీ మునిరామయ్య తెలిపారు. 

Updated : 30 Oct 2022 18:00 IST

తిరుమల: తిరుమల శ్రీవారి సేవ టికెట్లు అంటూ సుపథం ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను అధిక ధరకు విక్రయించి.. భక్తులను మోసం చేసిన వ్యక్తిని అరెస్టు చేశామని తిరుమల ఏఎస్పీ మునిరామయ్య తెలిపారు. కాణిపాకం దేవస్థానంలో గ్యాస్‌ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగి కరుణ ..కాణిపాకం దేవస్థానం ఏఈవో సిఫార్సు లేఖపై తితిదే ఛైర్మన్‌ కార్యాలయంలో టికెట్లు పొందారు. ఆ టికెట్లను కర్ణాటకలోని చింతామణికి చెందిన భక్తులకు రూ.32వేలకు శ్రీవారి సేవ దర్శన టికెట్లు అని చెప్పి విక్రయించడంతో వారు తితిదే విజిలెన్స్‌ అధికారులను ఆశ్రయించారు. కరుణను అదుపులోకి తీసుకున్నామని, ఏఈవో మాధవరెడ్డిని కూడా విచారిస్తున్నామని ఏఎస్పీ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని