Tirumala-Ayodhya: ప్రాణప్రతిష్ఠ వేడుక.. అయోధ్యకు తిరుమల శ్రీవారి ప్రసాదంగా లక్ష లడ్డూలు

అయోధ్యలో ఈ నెల 22న ప్రాణప్రతిష్ఠ వేడుకను పురస్కరించుకొని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) తిరుమల శ్రీవారి ప్రసాదంగా లక్ష లడ్డూలను అక్కడకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

Updated : 18 Jan 2024 17:26 IST

తిరుమల: అయోధ్యలో ఈ నెల 22న ప్రాణప్రతిష్ఠ వేడుకను పురస్కరించుకొని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) శ్రీవారి ప్రసాదంగా లక్ష లడ్డూలను పంపించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా వచ్చే భక్తుల కోసం లక్ష లడ్డూలను (ఒక్కో లడ్డూ.. 25 గ్రాములు) పంపించనుంది. ఇందుకోసం తిరుమ‌లలోని శ్రీ‌వారి సేవాస‌ద‌న్‌-1లో శ్రీ‌వారి సేవ‌కులు ఒక్కో క‌వ‌ర్‌లో రెండు ల‌డ్డూలు చొప్పున ప్యాకింగ్ చేశారు. ఇలా మొత్తంగా 350 బాక్సుల‌ను సిద్ధం చేశారు. 350 మంది శ్రీ‌వారి సేవ‌కులు, తితిదే డిప్యూటీ ఈవో శివప్రసాద్‌, పోటు ఏఈవో శ్రీ‌నివాసులు, సిబ్బంది ఈ  కార్యక్రమంలో పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు