Tirumala: స్వర్ణరథంపై భక్తులకు తిరుమలేశుడి అభయం

వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. ధనుర్మాసం నేపథ్యంలో ముందుగా తిరుప్పావై ప్రవచనాలు వినిపించడంతోపాటు శ్రీవారికి ఇతర కైంకర్యాలు పూర్తి చేశారు.

Updated : 23 Dec 2023 11:11 IST

తిరుమల: వైకుంఠ ఏకాదశి సందర్భంగా అశేష భక్త జనం మధ్య తిరుమలేశుడు స్వర్ణరథంపై తిరుమల మాడవీధుల్లో విహరించారు. శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వర్ణరథంపై భక్తులకు శ్రీవారు దర్శనమిచ్చారు. మరోవైపు, వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. ధనుర్మాసం నేపథ్యంలో ముందుగా తిరుప్పావై ప్రవచనాలు వినిపించడంతోపాటు శ్రీవారికి ఇతర కైంకర్యాలు పూర్తి చేశారు. అనంతరం శ్రీవారిని భక్తులు దర్శించుకుంటున్నారు. అర్ధరాత్రి నుంచే స్వామివారి దర్శనార్థం భక్తులు బారులు తీరారు. జనవరి 1న అర్ధరాత్రి 12 గంటల వరకు వైకుంఠ ద్వారాలు తెరిచి ఉండనున్నాయి. టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నారు. ద్వాదశి సందర్భంగా ఆదివారం శ్రీవారి చక్రస్నానం నిర్వహించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని