Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 30 Jul 2021 13:28 IST

1. Jagan bail cancel petition.. ఆగస్టు 25న తీర్పు వెల్లడించనున్న కోర్టు

అక్రమాస్తుల కేసులో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ బెయిల్‌ రద్దు చేయాలన్న పిటిషన్‌పై సీబీఐ కోర్టులో వాదనలు ముగిశాయి. ఈ కేసులో ఆగస్టు 25న కోర్టు తుది తీర్పు వెల్లడించనుంది. జగన్‌ బెయిల్‌ రద్దు కోరుతూ ఎంపీ రఘురామ కృష్ణరాజు వేసిన పిటిషన్‌లో లిఖిత పూర్వక వాదనలకు సీబీఐ నేడు మరోసారి సమయం కోరింది. సీబీఐ నుంచి ఇంకా ఎలాంటి సమాచారం రాలేదని సీబీఐ తరఫు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. ఈ నేపథ్యంలో మరికొంత సమయం ఇవ్వాలని కోరారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

AP News : ఏపీలో రాత్రి కర్ఫ్యూ పొడిగింపు

2. CBSE: సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు నేడు..

సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్ష ఫలితాలు నేడు వెల్లడికానున్నాయి. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ప్రకటించింది. జులై 31 నాటికి సీబీఎస్‌ఈ ఫలితాలను ప్రటించాలని భావిస్తున్నట్లు గత నెల కేంద్రం సుప్రీంకు వెల్లడించిన సంగతి తెలిసిందే. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో 12వ తరగతి పరీక్షలు రద్దయ్యాయి. విద్యార్థులు ఫలితాల కోసం బోర్డు అధికారిక వెబ్‌సైట్‌(cbseresults.nic.in)ను వీక్షించవచ్చు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. Mary Kom: బౌట్‌కు ఒక్క నిమిషం ముందు.. డ్రెస్‌ మార్చుకోమన్నారు!

ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్‌, లండన్‌ ఒలింపిక్‌ కాంస్య పతక విజేత మేరీకోమ్‌ అనూహ్య రీతిలో టోక్యో ఒలింపిక్స్‌ నుంచి నిష్క్రమించింది. గురువారం జరిగిన 51 కిలోల ప్రీక్వార్టర్స్‌లో 2-3తో రియో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత ఇంగ్రిట్‌ వాలెన్సియా (కొలంబియా) చేతిలో ఓడింది. అయితే బౌట్‌ ఆద్యంతం ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించినా.. న్యాయనిర్ణేతల స్ప్లిట్‌ డిసిషన్‌తో మేరీకి పరాజయం తప్పలేదు. దీంతో జడ్జీల తీరుపై మేరీకోమ్‌ అసంతృప్తి చెందింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tokyo Olympics: భారత్‌కు మరో పతకం ఖాయం.. సెమీస్‌కు లవ్లీనా 

4. USA: ఏటా 20 లక్షల కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం

అమెరికాలో మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపర్చే దిశగా కీలక ముందడుగు పడింది. దాదాపు రూ.75 లక్షల కోట్ల (1 ట్రిలియన్‌ డాలర్లు) విలువైన జాతీయ మౌలిక వసతుల ప్రణాళికను ముందుకు తీసుకెళ్లేందుకు సెనేట్‌ ప్రాథమికంగా ఆమోదం తెలిపింది. దేశాధ్యక్షుడు జో బైడెన్‌ ఈ ప్రణాళికను ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నారు. రిపబ్లికన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తుండటంతో దాని అమలుపై కొన్నాళ్లుగా అనిశ్చితి నెలకొంది. నిధుల వ్యయానికి సంబంధించి కొన్ని నిబంధనలను సవరించేందుకు ప్రభుత్వం అంగీకరించడంతో.. 67-32 ఓట్ల తేడాతో దానికి తాత్కాలిక ఆమోద ముద్ర లభించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. International Space Station: అంతరిక్ష కేంద్రంలో అనూహ్య పరిణామం!

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్‌)లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. రష్యా పంపిన కొత్త మాడ్యూల్‌.. కేంద్రానికి అనుసంధానమైన కొన్ని గంటల్లోనే అందులోని థ్రస్టర్లు అనుకోకుండా మండాయి. దీంతో ఐఎస్‌ఎస్‌ దిశ అదుపు తప్పింది. అయితే, భూమిపై నుంచి ఐఎస్‌ఎస్‌ కదలికల్ని నిరంతరం పర్యవేక్షించే ‘గ్రౌండ్‌ కంట్రోల్‌ సిస్టం’ బృందం కొద్ది నిమిషాల్లోనే తిరిగి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఐఎస్‌ఎస్‌లో ఉన్న వ్యోమగాములకు ఎలాంటి ప్రమాదం లేదని అమెరికా అంతరిక్ష కేంద్రం నాసా స్పష్టం చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Pegasus: పెగాసస్‌పై విచారణకు సుప్రీం ఓకే

6. ఒత్తిడికి గురవుతున్నారా..? ఇలా చేసి చూడండి!

ఈ ఆధునిక.. పోటీ ప్రపంచంలో మనుషులు ఏదో విధంగా ఒత్తిడికి గురవుతున్నారు. ఉద్యోగం, వ్యాపారం, వ్యక్తిగతం, కుటుంబం ఇలా జీవితంలో భాగమైన ఎన్నో విషయాల గురించి ఆలోచిస్తూ మానసికంగా నలిగిపోతున్నారు. కరోనా మహమ్మరి కారణంగా ఒత్తిళ్లు మరింత పెరిగాయి. వైరస్‌ వ్యాప్తి, అనారోగ్యం, ఉద్యోగం-వ్యాపారంలో అభద్రత, భవిష్యత్‌పై ఆలోచనలు వంటివి మనిషిని మరింత కుంగదీస్తున్నాయి. దీంతో మెదడుకు ప్రశాంతత కరవవుతోంది. మానసిక క్షోభతో ఆరోగ్యం దెబ్బతింటుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. Trisha: పెళ్లి వార్తలపై ఎట్టకేలకు స్పందించిన త్రిష

దక్షిణాది అగ్రకథానాయిక త్రిష కృష్ణన్‌ పెళ్లి వార్తలపై స్పష్టత వచ్చింది. త్రిషకు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని ఆమె టీమ్‌ తెలిపింది. కోలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖ దర్శకుడితో త్రిష ప్రేమలో ఉందని.. పెద్దల అంగీకారంతో త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీటలెక్కనున్నారని గత కొన్నిరోజుల నుంచి నెట్టింట్లో వరుస కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో సదరు వార్తలపై త్రిష టీమ్‌ స్పందించింది. అవన్నీ పుకార్లు మాత్రమేనని తేల్చి చెప్పింది. ప్రస్తుతం ఆమె దృష్టి మొత్తం సినిమాలు, కెరీర్‌పైనే ఉందని.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Radhesyam: అప్‌డేట్‌ వచ్చేసింది.. ఫ్యాన్స్ సెలబ్రేషన్స్‌కు చిన్న ఆలస్యం

8. Gold: 76 టన్నుల పసిడి అమ్మకాలు..19.2 శాతం వృద్ధి!

దేశీయంగా ఏప్రిల్‌-జూన్‌లో 76.1 టన్నుల పసిడికి గిరాకీ ఏర్పడింది. గతేడాది ఏప్రిల్‌-జూన్‌ నాటి 63.8 టన్నులతో పోలిస్తే, ఈసారి 19.2 శాతం వృద్ధి లభించింది. అయితే మార్చి త్రైమాసికంతో పోలిస్తే, గిరాకీ 46 శాతం తగ్గింది. గతేడాది ఏప్రిల్‌-జూన్‌లో దేశవ్యాప్త లాక్‌డౌన్‌ వల్ల దుకాణాలు మూసిఉండటంతో, అమ్మకాలు స్తంభించి ఈసారి గిరాకీ పెరిగినట్లు కనిపిస్తోందని,  కొవిడ్‌ రెండోదశ పరిణామాల వల్ల ఈసారీ పెద్దగా జరగలేదని ప్రపంచ స్వర్ణ మండలి(డబ్ల్యూజీసీ) వెల్లడించింది. అక్షయ తృతీయ, పెళ్లిళ్ల సీజనులో కూడా పెద్దగా గిరాకీ కనిపించలేదని పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. Antibodies: ప్రమాదకర వేరియంట్లూ తల వంచాల్సిందే

కరోనా మహమ్మారిని మరింత సమర్థంగా అడ్డుకునేందుకు... నిలకడగా ఉండే అత్యంత శక్తిమంతమైన మినీ యాంటీబాడీలను జర్మనీ శాస్త్రవేత్తలు తయారుచేశారు! దక్షిణ అమెరికాలో ఉండే ఒంటె జాతికి చెందిన ఆల్పకా జంతువుల రక్తం ద్వారా వీటిని అభివృద్ధిపరిచారు. అత్యంత ప్రమాదకర కరోనా వేరియంట్లను కూడా ఇవి సమర్థంగా అడ్డుకోగలవని పరిశోధకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గొటింజెన్‌లోని యూనివర్సిటీ మెడికల్‌ సెంటర్, మ్యాక్స్‌ ప్లాంక్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ బయోఫిజికల్‌ కెమిస్ట్రీ శాస్త్రవేత్తలు సాగించిన ఈ పరిశోధన వివరాలను ‘ఈఎంబీవో’ పత్రిక అందించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* India Corona: 44 వేలకు చేరిన కొత్త కేసులు.. మృతుల సంఖ్య ఎంతంటే..?

10. Thimmarusu Review: రివ్యూ: తిమ్మరుసు

రెండో ద‌శ క‌రోనాతో మూడు నెల‌లకిపైగా థియేట‌ర్లు మూత‌బ‌డిపోయాయి.  బాక్సాఫీసు ద‌గ్గ‌ర కొత్త సినిమా ఊసే లేకుండా పోయింది.  కొన్ని సినిమాలు ఓటీటీ బాట ప‌ట్టాయి. క్లిష్ట‌మైన ప‌రిస్థితుల మ‌ధ్య తెరుచుకున్న థియేట‌ర్ల ముందుకు  మొట్ట మొద‌ట‌గా ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన చిత్రాల్లో ఒక‌టి... `తిమ్మ‌రుసు`.   ప్రేక్ష‌కుల స్పంద‌న ఎలా ఉంటుందా అని ప‌రిశ్ర‌మ మొత్తం ఈ సినిమా విడుద‌ల కోసం ఆస‌క్తిగా ఎదురు చూశాయి.  మంచి క‌థ‌ల్ని ఎంచుకుంటూ... మంచి పాత్ర‌ల్లో ఒదిగిపోయే స‌త్య‌దేవ్ క‌థానాయ‌కుడిగా న‌టించ‌డంతో ఈ సినిమాపై ప్రేక్ష‌కుల్లోనూ మంచి అంచ‌నాలే ఏర్ప‌డ్డాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని