Updated : 05 Oct 2021 13:18 IST

Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. Sameer Wankhede: సమీర్‌ వాంఖడే.. ‘తెర’చాటు డ్రగ్స్‌పై ముంబయి ‘సింగం’

సమీర్‌ వాంఖడే.. బాలీవుడ్‌లో చాలా మంది సెలబ్రిటీలకు మింగుడు పడని పేరిది. మాదక ద్రవ్యాల ‘తెర’చాటు వ్యవహారాలపై ఆయనో సింహస్వప్నం. నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) ముంబయి జోనల్‌ డైరెక్టర్‌ అయిన సమీర్‌.. బాలీవుడ్‌లో డ్రగ్స్‌ రాకెట్‌ గుట్టు రట్టు చేస్తూ డ్రగ్స్‌ డీలర్లు, సినీ ప్రముఖుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. కేవలం రెండేళ్ల వ్యవధిలో రూ. 17వేల కోట్ల విలువైన డ్రగ్స్‌ పట్టుకున్నారంటే ఆయన ఎంతటి నిఖార్సైన ఆఫీసరో అర్థం చేసుకోవచ్చు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. MAA Elections: ‘ఏజెంట్లతో పోస్టల్‌ బ్యాలెట్‌ కుట్ర’: మంచు విష్ణు ప్యానల్‌పై ప్రకాశ్‌రాజ్‌ ఫిర్యాదు

‘మా’ ఎన్నికల రాజకీయం మరింత వేడెక్కుతోంది. మంచు విష్ణు ప్యానల్‌పై ప్రకాశ్‌రాజ్‌ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల నియమావళిని మంచు విష్ణు ప్యానల్‌ ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. ‘మా’ ఎన్నికల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ దుర్వినియోగం అవుతోందని చెప్పారు. ఈ మేరకు తన ప్యానల్‌ సభ్యులతో కలిసి ఎన్నికల అధికారికి ప్రకాశ్‌రాజ్‌ ఫిర్యాదు చేశారు. అనంతరం జీవితా రాజశేఖర్‌, శ్రీకాంత్‌ తదితరులతో కలిసి ప్రకాశ్‌రాజ్‌ మీడియాతో మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

MAA Elections: పోస్టల్‌ బ్యాలెట్‌ వివాదం.. స్పందించిన ఎన్నికల అధికారి

3. China's property bubble: డ్రాగన్‌ను భయపెడుతున్న ‘ఘోస్ట్‌ సిటీ ’లు..!

చైనా ‘రియల్‌’ ప్రకంపనలు మొదలయ్యాయి.. ఇప్పటికే ఎవర్‌గ్రాండె దాదాపు 300 బిలియన్‌ డాలర్ల అప్పులు ఎగ్గొట్టే దిశగా అడుగులు వేస్తుండగా.. ఇప్పుడు దానికి ఫాంటాసియా అనే రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ తోడైంది. తాను కూడా బాండ్లపై చెల్లింపులు చేయలేనని చేతులెత్తేసింది. దీంతో చైనాలో రియల్‌ ఎస్టేట్‌ రంగం తీవ్ర కష్టాల్లో ఉన్న విషయం వెలుగులోకి వస్తోంది. ఇదే నిజమైతే చైనా వృద్ధిరేటు దారుణంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. Lakhimpur Kheri Violence: లఖింపుర్‌ ఖేరి ఘటన వీడియో వైరల్‌!

ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్‌ ఖేరిలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనపై విపక్షాలు, రైతుసంఘాల నేతలు పెద్దఎత్తున ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. సోమవారం బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తున్న కాంగ్రెస్‌ నేత ప్రియాంకా గాంధీ వాద్రా, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ తదితరులను పోలీసులు అరెస్టు చేసి, నిర్బంధించారు. నేతలెవరూ లఖింపుర్‌కు రాకుండా కట్టడి చేశారు. ఇదిలా ఉండగా, తాజాగా ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో స్థానికంగా వైరల్‌గా మారింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. IPL 2021: ఈ నాలుగింట్లో.. ప్లేఆఫ్స్ చేరేదెవరు?

ఐపీఎల్‌ 14వ సీజన్‌లో లీగ్‌ మ్యాచ్‌లు చివరి దశకు చేరుకున్నాయి. దీంతో ఇప్పుడు అందరి దృష్టి ప్లేఆఫ్స్‌పై పడింది. ఇప్పటికే చెన్నై సూపర్‌ కింగ్స్‌, దిల్లీ క్యాపిటల్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తమ స్థానాలను ఖరారు చేసుకోగా పది ఓటములతో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ఈ రేసు నుంచి తప్పుకుంది. ఈ నేపథ్యంలో మిగిలిన ఒకే ఒక్క నాలుగో స్థానం కోసం నాలుగు జట్లు పోటీపడుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

IPL 2021: ఇది బర్త్‌డే గిఫ్ట్‌ కాదు: పంత్‌.. మేం ధాటిగా ఆడలేక విఫలమయ్యాం: ధోనీ

6. Smartphones: ₹15 వేల లోపు మంచి ఫోన్‌ ఉంటే చెప్పొచ్చుగా!

₹10 వేల లోపు (Below Rs.10,000) ప్రస్తుతం అందుబాటులో ఉన్న మొబైల్స్‌ (Mobiles) వివరాలను సోమవారం చూసుంటారు (ఒకవేళ చూడకపోతే ఈ లింక్‌ క్లిక్‌ చేయండి). ఇప్పుడు అంతకంటే కొంచెం ఎక్కువ బడ్జెట్‌ ఉన్నవాళ్లు... అంటే ₹11 వేలు నుంచి ₹15 వేల వరకు (Below Rs. 15,000) పెట్టి స్మార్ట్‌ఫోన్స్‌ (Smartphones) కొందాం అనుకునేవారి కోసమే ఈ జాబితా. మొబైల్స్ ఫీచర్లు... ఆఫర్లు, డిస్కౌంట్లు (Offers, Discounts) పోగా వచ్చే ధర, వివరాలు ఇస్తున్నాం. ఎప్పట్లాగే ఓ లుక్కేయండి మరి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. vidyullekha raman: స్విమ్‌సూట్‌లో విద్యుల్లేఖ రామన్‌.. విమర్శకులకు ఘాటు స్పందన

తెలుగు, తమిళ భాషల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా, హాస్యనటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు విద్యుల్లేఖ రామన్‌. తెరపై కనిపించేది కొద్దిసేపే అయినా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తారు. ఇక ఆమె ఎక్స్‌ప్రెషన్స్‌, కామెడీ టైమింగ్‌ అదుర్స్‌. గతేడాది తన స్నేహితుడి సంజయ్‌తో నిశ్చితార్థం జరగ్గా, కొన్ని రోజులు కిందట వివాహం కూడా చేసుకున్నారు. కరోనా కారణంగా బంధువుల, స్నేహితులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. Facebook: గంటల వ్యవధిలో రూ.52 వేల కోట్లు హాంఫట్‌!

సోమవారం సామాజిక మాధ్యమాలు ఫేస్‌బుక్‌, వాట్సప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ స్తంభించిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఫేస్‌బుక్ సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ సంపద కొన్ని గంటల వ్యవధిలోనే 7 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.52 వేల కోట్లు) తరిగిపోయింది. దీంతో ఆయన బ్లూమ్‌బెర్గ్‌ బిలియనీర్స్‌ జాబితాలో మూడు నుంచి ఐదో స్థానానికి పడిపోయారు. ప్రస్తుతం ఆయన సంపద 122 బిలియన్‌ డాలర్లుగా ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Wealth Creation: సంపద సృష్టించాలంటే ఈ అపోహలొద్దు!

9. AP News: కాకినాడ మేయర్‌పై ముగిసిన అవిశ్వాస తీర్మాన ప్రక్రియ

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగరపాలక సంస్థ మేయర్‌ సుంకర పావని, డిప్యూటీ మేయర్‌-1 సత్తిబాబుపై కార్పొరేటర్లు పెట్టిన అవిశ్వాస తీర్మానం ఓటింగ్‌ ప్రక్రియ ముగిసింది. ఈ మేరకు ప్రొసీడింగ్‌ అధికారి, జేసీ లక్ష్మీశ ప్రకటించారు. కోర్టు తీర్పు నేపథ్యంలో అవిశ్వాస తీర్మానం ఫలితాన్ని రిజర్వులో ఉంచినట్లు ఆయన వెల్లడించారు. మేయర్‌పై అవిశ్వాస తీర్మానం ఓటింగ్‌లో తెదేపా అసమ్మతి కార్పొరేటర్లు విప్‌ను ధిక్కరించి అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా ఓటేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. TS News: రూ.20లక్షల కోట్ల కేంద్ర ప్యాకేజీ మిథ్య: కేటీఆర్‌

కరోనా సమయంలో పారిశ్రామిక రంగానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.20లక్షల కోట్ల ఉప సంహరణ ప్యాకేజీ మిథ్యగా మారిందని మంత్రి కేటీ రామారావు విమర్శించారు. పారిశ్రామిక రంగంపై కరోనా ప్రభావం ఏ మేరకు పడిందని ఎమ్మెల్సీ భానుప్రసాద్‌రావు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. పరిశ్రమల శాఖ తీసుకున్న పురోగమన విధానాలను కేటీఆర్‌ వివరించారు. కొవిడ్‌ సమయంలో కొత్త పెట్టుబడు వృద్ధిలో ఎలాంటి తగ్గుదల లేదన్నారు. 2020 ఏప్రిల్‌ నుంచి కొత్త యూనిట్ల ప్రారంభంలో మాత్రం కొంత తగ్గుముఖం ఉందని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని