Updated : 24 Jan 2022 13:43 IST

Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. Stock Market: అంతర్జాతీయ సంకేతాలతో సూచీలు ఆగమాగం!

అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాల నడుమ ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) సూచీలు అంతకంతకూ దిగజారుతున్నాయి. ఆసియా మార్కెట్ల పతనం, దిగ్గజ షేర్లలో అమ్మకాలు సూచీలను మరింత కిందకు లాగుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో మధ్యాహ్నం 12:24 గంటల సమయంలో సెన్సెక్స్ (Sensex) 1281 పాయింట్ల నష్టంతో 57,755 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 392 పాయింట్లు పడి 17,224 వద్ద పయనిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. Karvy: కార్వీ సంస్థ ఛైర్మన్‌ పార్థసారథి అరెస్ట్‌

కార్వీ సంస్థ ఛైర్మన్‌ పార్థసారథిని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అరెస్ట్‌ చేసింది. బెంగళూరులో ఉన్న ఆయన్ను ఈడీ అధికారులు పీటీ వారెంట్‌పై హైదరాబాద్‌ తీసుకొచ్చి చంచల్‌గూడ జైలుకు తరలించారు. కార్వీ సంస్థ తీసుకున్న రుణాలు చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులు గతంలోనే హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడుల పేరిట భారీ మోసానికి పాల్పడినట్లు గుర్తించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. Rahul Dravid: అవును.. వన్డే జట్టులో సమతౌల్యం లోపించింది..!

భారత్ వన్డే జట్టులో సమతౌల్యం లోపించిందని హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అంగీకరించాడు. జట్టులోని ఆరు, ఏడు స్థానాల్లో ఆల్‌రౌండర్లు హార్థిక్‌ పాండ్య, రవీంద్ర జడేజా లేని లోపం స్పష్టంగా కనిపించిందని అభిప్రాయపడ్డాడు. అయితే దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డేసిరీస్‌లో భారత జట్టు బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో విఫలమై సిరీస్‌ను కోల్పోవడం కె.ఎల్‌. రాహుల్‌ కెప్టెన్సీపై ప్రభావం చూపబోదని ద్రవిడ్‌ పేర్కొన్నాడు. వన్డే ఫార్మాట్‌లో జట్టు కూర్పులో పునఃసమీక్షించుకోవడంపై ద్రవిడ్‌ స్పందిస్తూ..పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* కోహ్లీ.. మరో రెండేళ్లు టెస్టు కెప్టెన్‌గా ఉండేవాడే, కానీ..

4. YouTube: యూట్యూబ్‌ చూసి ప్రయోగం.. లక్షల్లో ఆదాయం

లాక్‌డౌన్‌తో ఎంతో మంది జీవనోపాధి కోల్పోయారు. కొందరు మాత్రం దీన్ని అవకాశంగా మలుచుకున్నారు. కష్ట సమయంలో స్వయం ఉపాధి పొందారు. ఆ కోవకే చెందుతాడు కేరళలోని ఇడుక్కి జిల్లా రాజకుమారి గ్రామానికి చెందిన అభిజిత్‌. లాక్‌డౌన్‌లో యూట్యూబ్‌ వీడియోలు చూసి.. కోడిపిల్లల ఉత్పత్తి యూనిట్‌ నిర్మించి స్వయం ఉపాధి పొందాడు. అభిజిత్‌.. తొలుత కాలక్షేపం కోసం కోడి పిల్లల ఉత్పత్తికి సంబంధించిన వీడియోలు చూసేవాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. KTR: హైదరాబాద్‌ శివారు ప్రాంతాల నీటి సరఫరాకు రూ.6వేల కోట్లు: కేటీఆర్‌

 దేశంలో ఒక్కో నగరానికి ఒక్కో సమస్య ఉందని.. హైదరాబాద్‌కు మాత్రమే అన్ని కోణాల్లో అనుకూలతలు ఉన్నాయని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఏ ప్రాజెక్టునైనా వచ్చే 50 ఏళ్లను దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. మణికొండ అల్కాపురి టౌన్‌షిప్‌లో ఓఆర్‌ఆర్‌ ఫేజ్‌-2 నీటి సరఫరా పనులకు కేటీఆర్‌ ఇవాళ శంకుస్థాపన చేశారు. రూ.587కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా ఓఆర్‌ఆర్‌ పరిధిలోని గ్రామాలు, కాలనీలు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. India Corona: 20 శాతం దాటిన కరోనా పాజిటివిటీరేటు

దేశంలో కరోనా వ్యాప్తి ఉద్ధృతి కొనసాగుతోంది. కొద్ది రోజులుగా మూడు లక్షలపైనే కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఆదివారం 14 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 3,06,064 మందికి వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ముందురోజు కంటే 27 వేల కేసులు తగ్గాయి. అందుకు నిర్ధారణ పరీక్షల సంఖ్యలో తగ్గుదల కూడా కారణంగా కనిపిస్తోంది. పాజిటివిటీ రేటు 17.7 శాతం నుంచి 20.7 శాతానికి ఎగబాకడం ఆందోళనకరంగా మారింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ‘నేను నిజంగానే బ్యాడ్‌లక్‌ సఖి’: కీర్తి సురేశ్‌

‘‘నేను నిజంగానే బ్యాడ్‌లక్‌ సఖి’’ అని అంటున్నారు కథానాయిక కీర్తిసురేశ్‌. ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గుడ్‌ లక్‌ సఖి’. క్రీడా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి నగేష్‌ కుకునూరు దర్శకత్వం వహించారు. మరి కొన్నిరోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం ‘గుడ్‌లక్‌ సఖి’ ట్రైలర్‌ను చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా పంచుకొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tollywood: ఈ వారం థియేటర్‌/ఓటీటీలో వచ్చే సినిమాలివే!

8. AP News: ఏపీ ఆర్థిక పరిస్థితిపై దిల్లీలో కీలక భేటీ

ఏపీ ఆర్థిక పరిస్థితిపై కేంద్ర ఆర్థికశాఖ కార్యాలయంలో కీలక సమావేశం జరుగుతోంది. కేంద్ర కార్యదర్శుల బృందంతో ఏపీ ప్రభుత్వ బృందం భేటీ అయింది. గతనెలలో ప్రధాని మోదీని ఏపీ సీఎం జగన్‌ కలిసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని.. కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఈ మేరకు వినతిపత్రం అందించారు. విభజన చట్టంలోని పెండింగ్‌ అంశాలు, రెవెన్యూ లోటు, పోలవరం నిధులు తదితర అంశాలపై ప్రధానితో చర్చించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. Alzheimers:గుండె జబ్బుతో మెదడులోనూ సమస్యలు

గుండె జబ్బు వల్ల నడి వయసులోనే మెదడులోనూ సమస్యలు మొదలవుతాయని తాజా అధ్యయనం పేర్కొంది. ఇది తీవ్ర మతిమరుపునకు దారితీయవచ్చని తేల్చింది. అల్జీమర్స్‌ వ్యాధికి కారణమయ్యే బీటా అమిలాయిడ్‌ అనే ప్రొటీన్‌ను ఇది మూడింతలు చేస్తుందని కూడా వివరించింది. బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ షెఫీల్డ్‌ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. మెదడులోని చర్యలకు, రక్త ప్రవాహానికి మధ్య సంధానకర్తగా ఉండే ఒక కీలక విధిని గుండె జబ్బు దెబ్బతీస్తుందని వారు చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. Hyderabad News: అర్ధరాత్రి వ్యాయామం.. మందలించిందని తల్లిని చంపేశాడు

అర్ధరాత్రి వ్యాయామం చేస్తుంటే తల్లి మందలించిందని కుమారుడు తల్లిని చంపేసిన ఘటన నగరంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సుల్తాన్‌బజార్‌కు చెందిన సుధీర్‌ నిన్న అర్ధరాత్రి వ్యాయామం చేస్తుండగా తల్లి పాపమ్మ మందలించింది. కోపంతో విచక్షణ కోల్పోయిన అతను తల్లిని రాడ్డుతో కొట్టి చంపాడు. అడ్డువచ్చిన చెల్లిని కూడా కొట్టడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. దీంతో ఆమెను ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని