Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Updated : 07 Apr 2022 13:20 IST

1. టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు.. సీఎస్ సోమేశ్‌కుమార్‌కు హైకోర్టు నోటీసులు

టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో ఈడీ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. సీఎస్‌ సోమేశ్ కుమార్‌, ఎక్సైజ్‌ డైరెక్టర్‌ సర్ఫరాజ్‌కు ఉన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. కోర్టు ధిక్కరణ ఆరోపణలపై 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అనంతరం ఈ కేసుపై తదుపరి విచారణను ఈనెల 25కు హైకోర్టు వాయిదా వేసింది.

2. ప్యాకేజింగ్‌ రంగంలో హైదరాబాద్‌లో విస్తృత అవకాశాలు: కేటీఆర్‌

తెలంగాణలో కోకాకోలా బేవరేజెస్‌ అదనపు పెట్టుబడులతో ముందుకొచ్చింది. కొత్త పరిశ్రమ ఏర్పాటుపై నగరంలోని తాజ్‌ కృష్ణా హోటల్‌లో మంత్రి కేటీఆర్‌ ఆధ్వర్యంలో అవగాహన ఒప్పందం జరిగింది. సిద్దిపేట జిల్లా తిమ్మాపూర్‌ వద్ద హిందూస్థాన్‌ కోకాకోలా నూతన పరిశ్రమ ఏర్పాటుకు సిద్ధమవగా.. ప్రభుత్వం 48.53ఎకరాలు కేటాయించింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడారు.


Viral video: ప్రేమించిన అబ్బాయి కోసం ఇద్దరు అమ్మాయిల బాహాబాహీ

ఏపీ ప్రభుత్వం జారీ చేసిన 5, 6 నంబర్‌ జీవోలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ విజయవాడ ఆటోనగర్‌ వ్యాపారులు, కార్మికులు బంద్‌ చేపట్టారు. నగరాలకు దూరంగా పారిశ్రామిక ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ఇటీవల ఈ జీవోలు తెచ్చింది. ఒకప్పుడు నగర శివారు, ఇప్పుడు నగరం నడిబొడ్డున ఉన్న ఆటోనగర్‌కు తాజా జీవోల నుంచి వెసలుబాటు ఇవ్వాలని వ్యాపారులు డిమాండ్‌ చేశారు. ఆటోనగర్ పారిశ్రామికవాడను కమర్షియల్‌గా మారుస్తూ ఇచ్చిన జీవోలను ఉపసంహరించుకోవాలని కోరారు.

4. భారత్‌ పవర్‌ గ్రిడ్‌పై చైనా హ్యాకర్ల దాడి..!

డ్రాగన్‌తో సరిహద్దు వివాదం జరుగుతున్న సమయంలో ఓ హ్యాకింగ్‌ వ్యవహారం సంచలనం సృష్టించింది. చైనా హ్యాకర్లు మరోసారి భారత్‌పై పంజా విసిరారు. ఈ సారి భారత పవర్‌ గ్రిడ్‌లోకి చొరబడిన వారు.. కీలక సమాచారాన్ని అపహరించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ‘రెడ్‌ఎకో’ గ్రూప్‌ వీటిని హ్యాక్‌ చేసింది. తాజాగా డబ్బెడ్‌ టాగ్‌-32 అనే గ్రూపు పేరు బయటకొచ్చింది.

5. ముంబయిలో తొలి ‘ఎక్స్‌ఈ’ కేసు.. కేంద్రం ఏమందంటే..?

దేశంలో కొవిడ్‌ కొత్త ‘ఎక్స్‌ఈ’ వేరియంట్‌ తొలి కేసు ముంబయిలో బయటపడినట్లు వస్తోన్న వార్తలను కేంద్ర ఆరోగ్యశాఖ ఖండించింది. ప్రస్తుతమున్న ఆధారాలతో కొత్త వేరియంట్‌ను ధ్రువీకరించలేమని ఆరోగ్య శాఖ చెప్పినట్లు పీఐబీ మహారాష్ట్ర ట్విటర్‌ వేదికగా వెల్లడించింది.


Tirumala: భక్తుల రద్దీని ఆసరా చేసుకొని దళారుల అక్రమాలు

తీవ్ర ఆహార, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ద్వీప దేశం శ్రీలంకకు ఆపన్నహస్తం అందించేందుకు భారత్‌ ముందుకొచ్చింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల నుంచి బియ్యాన్ని ఎగుమతి చేస్తుండగా.. చమురు సాయాన్నీ అందిస్తోంది. ఇప్పటి వరకు ఆ దేశానికి 2.7లక్షల మెట్రిక్‌ టన్నులకు పైగా పలు రకాల ఇంధనాలను సరఫరా చేసింది. ఈ మేరకు శ్రీలంకలోని భారత రాయబార కార్యాలయం ట్విటర్‌ వేదికగా ప్రకటించింది.

7. చితక్కొట్టడంలో ఇదొక అత్యుత్తమ ప్రదర్శన.. కమిన్స్‌పై ప్రశంసల వర్షం

కోల్‌కతా ఆటగాడు ప్యాట్‌ కమిన్స్‌ గతరాత్రి ముంబయిపై అద్భుతంగా ఆడటంతో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. కేవలం 14 బంతుల్లోనే అర్ధ శతకం సాధించి టీ20 లీగ్‌లో అత్యంత వేగవంతమైన హాఫ్‌ సెంచరీ పూర్తిచేశాడు. దీంతో పంజాబ్‌ తరఫున కేఎల్‌ రాహుల్‌ 2018లో దిల్లీపై నెలకొల్పిన రికార్డును సమం చేశాడు. ఈ మ్యాచ్‌లో ముంబయి నిర్దేశించిన 162 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా 16 ఓవర్లలోనే పూర్తి చేయగా.. కమిన్స్‌ (56 నాటౌట్‌; 15 బంతుల్లో 4x4, 6x6) విశ్వరూపం ప్రదర్శించాడు.

8. తారక్‌ని ఆ సీన్‌లో చూసి కన్నీళ్లు వచ్చేశాయ్‌: ఒలీవియా

బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో తెలుగు తెరకు పరిచయమైన బ్రిటీష్‌ నటి ఒలీవియా మోరీస్‌. తారక్‌ లవ్‌ లేడీ జెన్నీఫర్‌ పాత్రలో ఆమె ఒదిగిపోయిన తీరు సినీ ప్రియుల్ని ఎంతో ఆకట్టుకుంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సక్సెస్‌లో భాగంగా తాజాగా ఒలీవియా ఓ ఎంటర్‌టైన్‌మెంట్‌ పోర్టల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. కెరీర్‌ ఆరంభంలోనే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వంటి అద్భుతమైన ప్రాజెక్ట్‌లో భాగం కావడం తనకెంతో ఆనందాన్ని అందించిందని ఆమె చెప్పుకొచ్చారు.


Rat Sets Fire: ఎలుక చేసిన పనికి.. రూ.2 లక్షల నగదు దగ్ధం..!

మేరియుపొల్‌ నగరంలో సృష్టించిన మారణకాండను దాచిపెట్టాలని రష్యా చూస్తోందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలన్‌స్కీ ఆరోపించారు. అందుకే తాము పంపే మానవతా సాయాన్ని అడ్డుకుంటోందని మండిపడ్డారు. ‘మేరియుపొల్‌లో జరిగిన దారుణాలను ఈ ప్రపంచం చూస్తుందేమోనని రష్యా భయపడుతోంది. అందుకే మేం పంపే మానవతా సాయాన్ని అడ్డుకుంటోంది. అక్కడ భారీ స్థాయిలో విషాదం నెలకొని ఉండి ఉంటుంది. అదొక నరకంగా మారి ఉంటుంది. పదుల్లో కాదు.. వేలల్లో ప్రజలు మృతి చెంది ఉంటారు.

10. కమిన్స్ అలా వచ్చి ఇలా ఆడతాడని ఎప్పుడూ ఊహించలేదు: రోహిత్‌

టీ20 మెగా లీగ్‌లో గతరాత్రి జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా పేసర్‌ ప్యాట్‌ కమిన్స్‌ (56 నాటౌట్‌; 15 బంతుల్లో 4x4, 6x6) చెలరేగడంతో ముంబయి ఈ సీజన్‌లో వరుసగా మూడో మ్యాచ్‌ను కోల్పోయింది. ఈ విషయంపై మాట్లాడిన ముంబయి సారథి రోహిత్‌ శర్మ.. కమిన్స్‌ ఇలా ఆడతాడని ఎప్పుడూ ఊహించలేదన్నాడు. ఈ మ్యాచ్‌లో క్రెడిట్‌ మొత్తం అతడికే దక్కుతుందని చెప్పాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని