KTR: ప్యాకేజింగ్‌ రంగంలో హైదరాబాద్‌లో విస్తృత అవకాశాలు: కేటీఆర్‌

రాష్ట్రంలో కోకాకోలా బేవరిజెస్‌ అదనపు పెట్టుబడులకు ముందుకొచ్చింది. కొత్త పరిశ్రమ ఏర్పాటుపై నగరంలోని తాజ్‌ కృష్ణా హోటల్‌లో

Updated : 07 Apr 2022 12:34 IST

కోకాకోలా సుమారు రూ.1,000కోట్ల పెట్టుబడులు.. కేటీఆర్‌ సమక్షంలో ఒప్పందం

హైదరాబాద్‌: రాష్ట్రంలో కోకాకోలా బేవరేజెస్‌ అదనపు పెట్టుబడులతో ముందుకొచ్చింది. కొత్త పరిశ్రమ ఏర్పాటుపై నగరంలోని తాజ్‌ కృష్ణా హోటల్‌లో మంత్రి కేటీఆర్‌ ఆధ్వర్యంలో అవగాహన ఒప్పందం జరిగింది. సిద్దిపేట జిల్లా తిమ్మాపూర్‌ వద్ద హిందూస్థాన్‌ కోకాకోలా నూతన పరిశ్రమ ఏర్పాటుకు సిద్ధమవగా.. ప్రభుత్వం 48.53ఎకరాలు కేటాయించింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడారు.

‘కోకాకోలా సంస్థ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. ఈ సంస్థ 25ఏళ్లుగా మంచి సేవలందిస్తోంది. కొత్త సంస్థ ద్వారా 10వేల మందికి ఉపాధి లభిస్తుంది. తిమ్మాపూర్‌లో రూ.1,000కోట్ల పెట్టుబడి పెట్టడం చాలా సంతోషం. కోకాకోలా కంపెనీ భవిష్యత్‌లో మరో రూ.400కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఈ కంపెనీ మహిళలకు 50శాతానికి పైగా ఉద్యోగాలు కల్పిస్తోంది. స్థానికంగా దొరికే వనరులు వాడుకోవాలని కంపెనీకి సూచిస్తున్నాం. ప్రస్తుతం ప్లాస్టిక్‌ వ్యర్థాలు సమస్యగా మారాయి. పర్యావరణహితమైన వాటిని వినియోగించాలని సంస్థలను కోరుతున్నాం. ప్యాకేజింగ్‌ రంగంలోనూ హైదరాబాద్‌లో విస్తృత అవకాశాలున్నాయి’’ అని కేటీఆర్‌ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని