Updated : 01 May 2021 17:31 IST

Top 10 News @ 5 PM

1. వైద్యారోగ్య శాఖ బదిలీపై స్పందించిన ఈటల

వైద్యారోగ్య శాఖను తన నుంచి సీఎం కేసీఆర్‌కు బదిలీ చేయడంపై ఈటల రాజేందర్‌ స్పందించారు. మెరుగైన సేవలు అందించేందుకే ఆ శాఖను తన నుంచి తప్పించారని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏ శాఖనైనా తీసుకునే అధికారం సీఎంకు ఉంటుందని.. ఏ మంత్రినైనా తొలగించే అధికారం కూడా ఆయనకు ఉంటుందన్నారు. మంత్రి పదవి ఉన్నా లేకున్నా వ్యక్తిగతంగా ప్రజలకు ఎప్పుడూ తోడుంటానని ఈటల స్పష్టం చేశారు.ఓ ప్రణాళిక ప్రకారమే తనపై దాడి జరుగుతోందని ఈటల ఆరోపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* ‘ఈటల భూకబ్జాలే కనిపిస్తున్నాయా.. మరి వారివి’

2. Corona విషయంలో అప్రమత్తంగా ఉండాలి: కేసీఆర్‌

తెలంగాణలో కరోనా చికిత్స, పడకలు, ఔషధాలు, ఆక్సిజన్, వ్యాక్సిన్ల విషయంలో ఎలాంటి సమస్యలు రాకూడదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సోమేశ్ కుమార్‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. కరోనా విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని.. ప్రతిరోజూ మూడు సార్లు సమీక్షించి పరిస్థితులను స్వయంగా పర్యవేక్షించాలని సీఎస్‌ను ఆదేశించారు. రెమ్‌డెసివర్ వంటి ఔషధాలు, ఆక్సిజన్, పడకలు, వ్యాక్సిన్ల లభ్యత విషయంలో ఎలాంటి లోపం జరగకూడదన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. Lock Down : కొంతకాలం విధిస్తేనే మేలు!

భారత్‌లో కరోనా రెండో దశ ఉద్ధృతిని కట్టడికి అంతర్జాతీయ స్థాయి అంటువ్యాధుల నివారణ నిపుణుడు, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ వైద్య సలహాదారుడు డాక్టర్‌ ఆంటోనీ ఫౌచీ కీలక సూచనలు చేశారు. వెంటనే దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించడంతో పాటు చైనా తరహాలో అత్యవసర చికిత్సా కేంద్రాలు భారీ ఎత్తున ఏర్పాటు చేయడం, కరోనా పరిస్థితుల సమగ్ర పర్యవేణకు ఓ కేంద్రీకృత వ్యవస్థ ఉండాలంటూ ఫౌచీ మూడు కీలక ప్రతిపాదనలు చేశారు. ఈ మేరకు ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌కు ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Sputnik V: హైదరాబాద్‌ చేరుకున్న రష్యా వ్యాక్సిన్‌

4. Covid ‘వాసన’ పట్టేస్తుంది!

వాసన కోల్పోవడంతో ముడిపడిన కొవిడ్‌-19 వంటి రుగ్మతలను వేగంగా పసిగట్టేందుకు ఒక పరీక్ష విధానాన్ని బ్రిటన్‌లోని క్వీన్‌ మేరీ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇది క్యాప్సూల్‌ ఆధారిత వాసన పరీక్ష అని వారు తెలిపారు. విస్తృత జనాభాలో కొవిడ్‌ను గుర్తించడానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పారు. కరోనా వైరస్‌తోపాటు పార్కిన్‌సన్స్, అల్జీమర్స్‌ వంటి నాడీ సంబంధ వ్యాధులను ఈ వాసన పరీక్ష సాయంతో గుర్తించొచ్చు. అయితే ఇవి విస్తృతంగా అందుబాటులో లేవు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఓట్ల లెక్కింపు వాయిదాతో ఆకాశమేం విరిగిపడదు

పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటు ఉత్తర్‌ప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కూడా ఆదివారమే జరగాల్సి ఉంది. అయితే, కొవిడ్‌ నేపథ్యంలో కౌంటింగ్‌ విధులకు హాజరు కావావాల్సిన ఉపాధ్యాయులు వెనుకాడుతున్నారు. ఈ మేరకు సుప్రీం కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై నేడు కోర్టులో వాడీవేడీ వాదనలు జరిగాయి. ఎట్టకేలకు కొవిడ్‌ నిబంధనల్ని పాటిస్తామన్న ఎన్నికల సంఘం హామీ మేరకు లెక్కింపు ప్రక్రియ కొనసాగించేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

రోడ్డు పక్కన 2 లక్షల కరోనా టీకాలు

 6. Home Loan వడ్డీ రేట్లు తగ్గించిన SBI!

ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) శుభావార్త అందజేసింది. గృహ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. 6.70 శాతం నుంచి వడ్డీ రేట్లు ప్రారంభం కానున్నట్లు పేర్కొంది. మహిళా రుణ గ్రహీతలకు మరో ఐదు బేసిస్‌ పాయింట్ల వరకు రాయితీని ఇవ్వనున్నట్లు తెలిపింది. ఖాతాదారులు యోనో యాప్‌ నుంచి గృహరుణాలను పొందవచ్చునని.. అలా తీసుకున్న వారికి మరో 5 బేసిస్‌ పాయింట్ల వరకు వడ్డీరేటును తగ్గిస్తామని తెలిపింది. నేటి నుంచే కొత్త రేట్లు అమల్లోకి రానున్నట్లు వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. భార్య నగలు అమ్మి ‘ఆటో అంబులెన్స్‌’

కరోనా విజృంభణ వేళ భారతావని ఆక్సిజన్‌ కోసం అల్లాడుతోంది. ఊపిరి నిలిపే ప్రాణవాయువు కరవై బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సకాలంలో ఆక్సిజన్‌ అందక కొందరు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు సైతం వెలుగుచూస్తున్నాయి. ఇలాంటి విపత్కర సమయంలో ఎంతోమంది మంచి మనసుతో ముందుకొస్తున్నారు. ఈ కోవకే చెందుతాడు మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ ఆటో డ్రైవర్‌. తన భార్య నగలను అమ్మి ‘ఆటో ఆంబులెన్స్‌’ ఏర్పాటుచేసిన అతడు రోగుల ఊపిరి నిలిపే ప్రయత్నం చేస్తున్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Remdesivir అందరికీ అవసరం లేదు

8.  Oxygen: 11% రిలయన్స్‌ నుంచే! 

కరోనా సెకండ్‌ వేవ్‌తో అల్లాడుతున్న భారత్‌కు ప్రముఖ కార్పొరేట్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఆపన్నహస్తం అందిస్తోంది. కరోనా సృష్టించిన విలయంతో ఆస్పత్రుల్లో బెడ్‌లు లేక, ఆక్సిజన్‌ కొరత వేధిస్తున్న తరుణంలో అలాంటి కీలక అవసరాలను తీర్చడంలో ఎనలేని సహకారం అందిస్తోంది. తద్వారా కరోనాపై భారత్‌ చేస్తున్న పోరాటంలో అవసరమైన అస్త్రాలను సమకూరుస్తూ అనేకమంది ప్రాణాలను కాపాడుతోంది. జామ్‌నగర్‌లోని రిఫైనరీ, పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌లో ప్లాంట్ల ద్వారా రోజూ 1000 మెట్రిక్‌ టన్నుల మెడికల్‌ గ్రేడ్‌ లిక్విడ్‌ ఆక్సిజన్‌ను యుద్ధప్రాతిపదికన ఉత్పత్తి చేసి దేశానికి అందిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. SRH కఠిన నిర్ణయం: వార్నర్‌పై వేటు

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ తాజా సీజన్లో వరుస ఓటములతో ఇబ్బంది పడుతున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కఠిన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌పై వేటు వేసింది. ఆదివారం రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగే మ్యాచుకు కేన్‌ విలియమ్సన్‌ సారథ్యం వహిస్తాడని ప్రకటించింది. ఇక మిగిలిన సీజన్‌కూ అతడే నాయకత్వం వహిస్తాడని స్పష్టం చేసింది. ఈ పోరులో తమ విదేశీ బృంద కూర్పులో మార్పులు ఉంటాయని తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Maiden IPL wicket: 8 vs విరాట్‌ కోహ్లీ

10. అందం గురించి బాధపడి.. స్టార్‌గా రాణించి 

ఆర్మీ కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. హీరోయిన్‌గానే కాకుండా నిర్మాతగానూ ప్రేక్షకుల్ని అలరించిన ముద్దుగుమ్మ అనుష్కశర్మ. కెరీర్‌ ఫామ్‌లో ఉన్న సమయంలోనే విరాట్‌తో ఏడడుగులు వేసి ఇప్పుడు గృహిణిగా, అమ్మగా అనుష్క అందర్నీ ఆకట్టుకుంటున్నారు. శనివారం ఆమె పుట్టిన రోజు సందర్భంగా అనుష్క శర్మ కెరీర్‌ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు ఆమె మాటల్లోనే.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

ఇవీ చదవండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని