Andhra news: ఎన్నికల వేళ.. రూ.100 కోట్ల నగదు, మద్యం, బంగారం స్వాధీనం: మీనా

ఏపీలో ఇప్పటి వరకు రూ.100 కోట్ల విలువైన మద్యం, నగదు, డ్రగ్స్‌ను పట్టుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్‌ కుమార్‌ మీనా తెలిపారు. 

Updated : 11 Apr 2024 16:59 IST

అమరావతి: ఏపీలో ఎన్నికల వేళ అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. ఇప్పటి వరకు రూ.100 కోట్ల విలువైన నగదు, మద్యం, డ్రగ్స్‌, బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్‌ కుమార్‌ మీనా వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన వివిధ చెక్‌పోస్టుల వద్ద ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు సరిహద్దు ప్రాంతాలు, జిల్లా సరిహద్దుల వద్ద సోదాలను మరింత విస్త్రృతం చేస్తున్నామని వివరించారు. సరిహద్దు రాష్ట్రాల పోలీసు బలగాలు, ఇతర ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలతో సమాచారాన్ని పంచుకుంటున్నట్లు తెలిపారు. అయితే, తనిఖీల్లో సాధారణ పౌరులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా వ్యవహరించాలని బృందాలను ఆదేశించినట్లు సీఈవో వివరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని