TS Eamcet: రేపు ఉదయం ఎంసెట్‌, ఈసెట్‌ ఫలితాలు విడుదల

తెలంగాణలో ఎంసెట్‌, ఈసెట్‌ ఫలితాలు శుక్రవారం విడుదల కానున్నాయి. ఉదయం 11.15 గంటలకు ఈసెట్, ఉదయం 11.45గంటలకు ఎంసెట్‌ ఫలితాలను విద్యాశాఖ

Updated : 11 Aug 2022 19:17 IST

హైదరాబాద్‌: తెలంగాణలో ఎంసెట్‌, ఈసెట్‌ ఫలితాలు శుక్రవారం విడుదల కానున్నాయి. ఉదయం 11.15 గంటలకు ఈసెట్, ఉదయం 11.45గంటలకు ఎంసెట్‌ ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేయనున్నారు. ఎంసెట్‌, ఈసెట్‌ ఫలితాలను www.eenadu.netలో చూడొచ్చు.

గత నెల 18 నుంచి 21 వరకు ఇంజినీరింగ్‌, 30, 31న అగ్రికల్చర్‌, ఫార్మా ఎంసెట్‌ నిర్వహించారు. ఇంజినీరింగ్‌కు 1,56,812 మంది, అగ్రికల్చర్‌, ఫార్మా కోర్సుల కోసం 80,575 మంది విద్యార్థులు పరీక్షలు రాశారని ఎంసెట్‌ కన్వీనర్‌ ఎ.గోవర్ధన్‌ తెలిపారు. ప్రాథమిక సమాధానాలు విడుదల చేసి విద్యార్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించారు. తుది సమాధానాలతో పాటు ఫలితాలను ఎంసెట్‌ కమిటీ విశ్లేషించింది. దీంతో ఫలితాలు విడుదల చేయాలని నిర్ణయించారు. అదేవిధంగా పాలిటెక్నిక్ డిప్లొమా అభ్యర్థులు బీటెక్, బీఫార్మసీ రెండో సంవత్సరంలో చేరేందుకు ఆగస్టు 1న నిర్వహించిన ఈసెట్ పరీక్షకు 9,402మంది హాజరయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని