TS News: తెలంగాణలో కొత్తగా మరో 288 బస్తీ దవాఖానాలు

తెలంగాణలోని పురపాలికల్లో కొత్తగా 288 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జీహెచ్‌ఎంసీలో ఇవి విజయవంతం కావడంతో వీటిని

Updated : 28 Dec 2021 16:01 IST

హైదరాబాద్‌: తెలంగాణలోని పురపాలికల్లో కొత్తగా 288 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జీహెచ్‌ఎంసీలో ఇవి విజయవంతం కావడంతో వీటిని పట్టణాలకూ విస్తరించాలని వైద్య ఆరోగ్యశాఖపై సమీక్షలో ప్రభుత్వం నిర్ణయించింది. ఎంసీహెచ్‌ఆర్‌డీలో వైద్య ఆరోగ్యశాఖపై జరిగిన సమీక్షలో మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌ పాల్గొన్నారు. జూన్‌ 2వరకు రెండు దశల్లో బస్తీ దవాఖానాలను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. టి-డయాగ్నోస్టిక్స్‌ సహకారంతో ప్రజలకు ఉచితంగా రోగ నిర్ధారణ పరీక్షలు చేయనున్నారు. వీటితో నాణ్యమైన వైద్య సేవలు పట్టణ ప్రజలకు చేరువకానున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని