TS:నూతన క్రీడా విధానం రూపకల్పన

నూతన క్రీడా విధానం రూపకల్పనకు సలహాలు, సూచనలు స్వీకరించేందుకు పలువురు క్రీడాకారులతో తెలంగాణ మంత్రి...

Published : 01 Aug 2020 22:49 IST

అధికారులు, క్రీడాకారులతో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ సమావేశం

హైదరాబాద్‌: నూతన క్రీడా విధానం రూపకల్పనకు సలహాలు, సూచనలు స్వీకరించేందుకు పలువురు క్రీడాకారులతో తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ సమావేశమయ్యారు. మాజీ క్రికెటర్‌ అజహరుద్దీన్‌, టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా, సిక్కిరెడ్డి, సాయిప్రణీత్‌, సుమిత్‌ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఒలింపిక్‌ సంఘం అధ్యక్షుడు జయేశ్‌ రంజన్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. కరోనా కారణంగా క్రీడారంగం తీవ్రంగా నష్టపోయిందన్నారు. ఈ నెల 5 నుంచి యోగా కేంద్రాలు, జిమ్‌లను ప్రారంభిస్తున్నామని చెప్పారు. తక్కువ మందితోనే వ్యాయామశాలలు నడిపించాలని పేర్కొన్నారు. ఈ నెల 5 నుంచి స్టేడియాల్లో క్రీడాకారులు సాధన చేయొచ్చని సూచించారు. స్టేడియాల్లో టోర్నమెంట్ల నిర్వహణకు అనుమతి లేదని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ స్పష్టం  చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని