బోర్డు మాజీ సభ్యులతో వచ్చే ఇతరులను శ్రీవారి దర్శనానికి అనుమతించం: తితిదే

తితిదే ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు కొందరు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి ఆక్షేపించారు.

Published : 11 Mar 2024 16:19 IST

తిరుమల: తితిదే ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు కొందరు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని తితిదే ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి ఆక్షేపించారు. బోర్డు మాజీ సభ్యులకు సంవత్సరంలో కొన్నిసార్లు కుటుంబసభ్యుల(తల్లిదండ్రులు, భార్య, పిల్లలు)తో కలిసి శ్రీవారి దర్శనం చేసుకునే అవకాశం ఉందన్నారు. అయితే, కొందరు మాత్రం నిబంధనలకు విరుద్ధంగా ఇతరులను వెంటబెట్టుకొని వస్తున్నారని తెలిపారు. ఇలా దర్శనానికి పదే పదే రావడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. ఇకపై కుటుంబసభ్యులను కాకుండా ఇతరులను వెంట తీసుకొస్తే.. వారిని శ్రీవారి దర్శనానికి అనుమతించేది లేదని తాజాగా జరిగిన బోర్డు సమావేశంలో స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు