TTD: రూ.5వేల కోట్లు దాటిన తితిదే వార్షిక బడ్జెట్‌

తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) పాలకమండలి 2024-25 వార్షిక బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది.

Updated : 29 Jan 2024 16:17 IST

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) పాలకమండలి 2024-25 వార్షిక బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. రూ.5,141.74 కోట్ల అంచనాలతో ప్రవేశపెట్టగా.. రూ.5,122.80 కోట్ల బడ్జెట్‌ను పాలకవర్గం ఆమోదించింది.

విభాగాల వారీగా కేటాయింపులు ఇలా..

  • ఇంజినీరింగ్ విభాగానికి రూ.350 కోట్లు 
  • హిందూ ధర్మప్రచార, అనుబంధ ప్రాజెక్టులకు రూ.108.50 కోట్లు
  • వివిధ సంస్థలకు గ్రాంట్స్ రూపంలో రూ.113.50 కోట్లు
  • రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం రూపంలో రూ.50 కోట్లు
  • తితిదే విద్యాసంస్థలు, వివిధ వర్సిటీలకు గ్రాంట్స్ రూ.173.31 కోట్లు
  • పారిశుద్ధ్య విభాగానికి రూ.261.07 కోట్లు
  • నిఘా, భద్రతా విభాగానికి రూ.149.99 కోట్లు
  • వైద్య విభాగానికి రూ.241.07 కోట్లు

ఆదాయ అంచనాలు...

  • శ్రీవారి హుండీ కానుకల ద్వారా రూ. 1,611 కోట్లు
  • ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రూపంలో రూ.1,167 కోట్లు
  • ప్రసాదం విక్రయాల ద్వారా రూ.600 కోట్లు
  • కల్యాణకట్ట రసీదుల ద్వారా రూ.151.50 కోట్లు
  • గదులు, కల్యాణమండపం బాడుగల ద్వారా రూ.147 కోట్లు
  • శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవ టికెట్ల విక్రయాల ద్వారా రూ.448 కోట్లు
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు