TTD: తిరుమల ఆస్థాన మండపంలో ధార్మిక సదస్సు ప్రారంభం

తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో తిరుమల ఆస్థాన మండపంలో ధార్మిక సదస్సు ప్రారంభమైంది.

Published : 03 Feb 2024 11:29 IST

తిరుమల: తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో తిరుమల ఆస్థాన మండపంలో ధార్మిక సదస్సు ప్రారంభమైంది. తితిదే ధర్మకర్తల మండలి అధ్యక్షుడు భూమన కరుణాకర్‌రెడ్డి ప్రారంభోపన్యాసం చేశారు. మఠాధిపతులు, పీఠాధిపతుల సూచనలతో ధర్మప్రచారాన్ని మరింత గొప్పగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తాను తొలిసారి ఛైర్మన్‌గా ఉన్న సమయంలో దళిత గోవిందం, మత్స్య గోవిందం, గిరిజన గోవిందం లాంటి కార్యక్రమాలను నిర్వహించి భగవంతుడిని భక్తుల చెంతకే తీసుకువెళ్లామని వివరించారు.

అన్నమాచార్య, పురందరదాసు, కనకదాసు, తరిగొండ వెంగమాంబ పేర్లతో ప్రాజెక్టులు నిర్వహిస్తున్నామని తెలిపారు. తమ వైపు నుంచి ఏవైనా పొరబాట్లు జరిగి ఉంటే తగిన సలహాలు ఇస్తే సవరించుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సు సోమవారం ముగియనుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి మఠాధిపతులు, పీఠాధిపతుల హాజరయ్యారు.

శ్రీవారి సేవలో మఠాధిపతులు, పీఠాధిపతులు

అంతకుముందు తిరుమల శ్రీవారిని చినజీయర్‌ స్వామి, కుక్కే సుబ్రహ్మణ్య పీఠాధిపతి విద్యాప్రసన్న తీర్థులు, వ్యాసరాజ మఠం పీఠాధిపతి విద్యాతీర్థ స్వామి, సత్యానంద ఆశ్రమం శ్రీహరి తీర్థానంద స్వామి, విశ్వగురు ఆశ్రమం విశ్వయోగి స్వామి, కడప బ్రహ్మంగారి మఠం విరజానంద స్వామి తదితరులు దర్శించుకున్నారు. తితిదే ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు