twitter blue tick: ట్విటర్‌ బ్లూ టిక్‌..! ఫన్నీ మీమ్స్‌.. చూస్తే నవ్వులే నవ్వుల్‌..!

ప్రముఖ సామాజిక మాధ్యమ వేదిక ట్విటర్‌ను ఎలన్‌మస్క్‌ సొంతం చేసుకున్న తర్వాత అనేక కీలక మార్పులకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.

Published : 11 Nov 2022 01:13 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ సామాజిక మాధ్యమ వేదిక ట్విటర్‌ను ఎలన్‌మస్క్‌ సొంతం చేసుకున్న తర్వాత అనేక కీలక మార్పులకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ట్విటర్‌ అకౌంట్‌లను అధికారికంగా గుర్తిస్తూ జారీ చేసే, బ్లూ టిక్‌ మార్కు కొనసాగాలంటే ప్రతి నెలా 8 అమెరికన్‌ డాలర్లు చెల్లించాలని షరతు విధించారు. కొందరు దీన్ని వ్యతిరేకించగా, మరికొందరు స్వాగతించారు. సెలబ్రిటీలు, అత్యధిక ఫాలోవర్లు, సమాజంలో  అతికొద్ది మందికి మాత్రమే సొంతమైన బ్లూటిక్‌ 7.99 అమెరికన్‌ డాలర్లు చెల్లిస్తే చాలు, ఎవరికైనా ట్విటర్‌ కేటాయిస్తోంది. దీంతో ఇప్పటివరకూ వెరిఫైడ్‌ కోసం వేచి చూసిన వాళ్లు, తమ ఖాతాకు బ్లూ టిక్‌ ఉండాలని ఆశించిన వారు ఆ మొత్తం చెల్లించి ఆ సేవను పొందుతున్నారు. దీంతో సోషల్‌మీడియాలో మీమ్స్‌ వెల్లువెత్తుతున్నాయి. పలు సినిమాల్లోని సన్నివేశాలను జోడించి వాటిని తీర్చిదిద్దిన విధానం చూస్తే నవ్వాగటం లేదు. బ్లూటిక్‌ సంగతి తర్వాత ముందు ఈ మీమ్స్‌ చూడండి.. అస్సలు నవ్వాగదు.


















Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని