Teachers: బదిలీలు ఆపాలంటూ 24 మంది విద్యార్థులను బంధించిన టీచర్లు

వారి బదిలీలను రద్దు చేయాలని పై అధికారులపై ఒత్తిడి తెచ్చేందుకు ఇద్దరు ఉపాధ్యాయులు చేసిన పనికి అందరూ నివ్వెరపోయారు.

Published : 23 Apr 2022 15:05 IST

లఖింపూర్‌: వారి బదిలీలను రద్దు చేయాలని పై అధికారులపై ఒత్తిడి తెచ్చేందుకు ఇద్దరు ఉపాధ్యాయులు చేసిన పనికి అందరూ నివ్వెరపోయారు. 24 మంది విద్యార్థులను పాఠశాల పైకప్పుపై ఉంచి తలుపులకు తాళం వేశారు. ఈ ఘటన లఖింపూర్‌ ఖేరీ జిల్లాలోని బెహ్జామ్ ప్రాంతంలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో చోటుచేసుకుంది. కొన్ని గంటల తర్వాత పోలీసులు తిరిగి బాలికలను వారి హాస్టల్‌కు పంపారు. వివరాల్లోకి వెళితే.. బెహ్జామ్‌లోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలోని ఇద్దరు ఉపాధ్యాయులను కొన్ని కారణాల వల్ల ఇటీవల బదిలీ చేశారు. దీంతో వారు బదిలీలను రద్దు చేయాలని అధికారులపై ఒత్తిడి తెచ్చారు. ఎంతకూ రద్దు చేయకపోవడంతో ఇలా విద్యార్థులను బంధించారని ప్రాథమిక విద్యా అధికారి లక్ష్మీకాంత్‌ పాండే తెలిపారు. ఇద్దరు ఉపాధ్యాయులపై పలు సెక్షన్‌ల కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు పాండే తెలిపారు. ఈ విషయంపై శాఖపరమైన విచారణకు కూడా ఆదేశించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని