Supreme Court: సునీత విజ్ఞప్తి.. అవినాష్‌రెడ్డి బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న కడప ఎంపీ అవినాష్‌రెడ్డి బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణ 3 వారాలకు వాయిదా పడింది.

Updated : 11 Sep 2023 13:24 IST

దిల్లీ: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న కడప ఎంపీ అవినాష్‌రెడ్డి బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణ 3 వారాలకు వాయిదా పడింది. అనివార్య కారణాల నేపథ్యంలో వాయిదా వేయాలంటూ వివేకా కుమార్తె, పిటిషనర్‌ సునీత నర్రెడ్డి తరఫు న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు. దీంతో ఆమె విజ్ఞప్తిని అంగీకరించిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. బెయిల్‌ రద్దు పిటిషన్‌ విచారణను వాయిదా వేసింది. 

అవినాష్‌రెడ్డికి ముందస్తు బెయిల్‌ ఇస్తూ ఈ ఏడాది మేలో తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దీన్ని సవాల్‌ చేస్తూ సునీత సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ సంజీవ్‌ కన్నా ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది. కొన్ని అనివార్య కారణాల రీత్యా కేసు విచారణను వాయిదా వేయాలని సునీత తరఫు న్యాయవాదులు కోరారు. దీంతో విచారణను సుప్రీంకోర్టు మూడు వారాలు వాయిదా వేసింది. ఆ తర్వాత నాన్‌ మిస్లేనియస్‌ డే రోజు విచారణ చేపట్టనున్నట్లు ధర్మాసనం తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని