Viveka Murder Case: వివేకా హత్య కేసు.. విచారణ వాయిదా

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసుపై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది.

Updated : 22 Sep 2023 12:44 IST

హైదరాబాద్‌: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసుపై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. విచారణకు వైకాపా ఎంపీ అవినాష్‌రెడ్డి, మిగతా నిందితులు హాజరయ్యారు. అనంతరం విచారణను న్యాయస్థానం వచ్చేనెల 4కి వాయిదా వేసింది.

మరోవైపు ఇదే కేసులో ఎస్కార్ట్‌ బెయిల్‌ పొందిన నిందితుడు వైఎస్‌ భాస్కర్‌రెడ్డి చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు. అనారోగ్య కారణాల దృష్ట్యా ఆయనకు 12 రోజులపాటు సీబీఐ కోర్టు ఎస్కార్ట్‌ బెయిల్‌ మంజూరు చేసింది. జైలు నుంచి విడుదలైన అనంతరం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి భాస్కర్‌రెడ్డి వెళ్లారు. హైదరాబాద్‌ విడిచి వెళ్లొద్దని ఆయన్ను న్యాయస్థానం ఆదేశించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని