Viveka Murder Case: దర్యాప్తునకు నేటితో ముగియనున్న గడువు.. సీబీఐ నిర్ణయంపై ఉత్కంఠ

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాప్తుపై సీబీఐకి సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో దర్యాప్తుపై సీబీఐ తీసుకోనున్న నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.

Updated : 30 Jun 2023 11:10 IST

హైదరాబాద్‌: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసు (Viveka Murder Case) దర్యాప్తుపై సీబీఐ(CBI)కి సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో దర్యాప్తుపై సీబీఐ తీసుకోనున్న నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. దర్యాప్తు కొలిక్కి వచ్చిందా? గడువు కోరతారా? అనేదానిపై సందిగ్ధత ఏర్పడింది. 

మరోవైపు ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఎంపీ అవినాష్‌రెడ్డి (YS Avinash Reddy) ముందస్తు బెయిల్‌ రద్దుకు వివేకా కుమార్తె సునీత వేసిన పిటిషన్‌పై జులై3న సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. నిందితుడు భాస్కర్‌రెడ్డి, ఒకరిద్దరిపై త్వరలో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. జులై 3న సుప్రీంకోర్టుకు కేసు దర్యాప్తు పురోగతి సీబీఐ వివరించి సమయం కోరే అవకాశముంది.

నిందితులను కోర్టులో హాజరుపరిచిన సీబీఐ

మరోవైపు నేడు సీబీఐ కోర్టులో వివేకా హత్య కేసుపై విచారణ జరిగింది. నిందితులు భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, సునీల్‌ యాదవ్‌, ఉమాశంకర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డిలను చంచల్‌గూడ జైలు నుంచి సీబీఐ కోర్టుకు తరలించారు. నిందితుల రిమాండ్‌ గడువు ముగియడంతో వారిని న్యాయస్థానంలో హాజరుపరిచారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు