22-02-2022 మ్యాజిక్‌: ఈ పాప పుట్టిన సమయంలో అన్నీ రెండ్లే! ఆఖరికి..

ప్రపంచంలో నిత్యం నిమిషానికి ఎన్నోవందల మంది జన్మిస్తుంటారు. అయితే, కొంతమంది బర్త్‌ డేలు మాత్రమే ప్రత్యేకంగా నిలుస్తాయి. సంవత్సరం ఆఖరి రోజు అయిన డిసెంబర్ 31, జనవరి 1 (న్యూ ఇయర్)‌

Published : 25 Feb 2022 01:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచంలో నిత్యం నిమిషానికి ఎన్నోవందల మంది జన్మిస్తుంటారు. అయితే, అందులో కొంతమంది బర్త్‌ డేలు మాత్రమే ప్రత్యేకంగా నిలుస్తాయి. సంవత్సరం ఆఖరి రోజు అయిన డిసెంబర్ 31న.. జనవరి 1న (న్యూ ఇయర్)‌ వంటి ప్రత్యేకమైన తేదీల్లో కొంతమంది జన్మిస్తుంటారు. నాలుగేళ్లకు ఒకసారి వచ్చే లీపు సంవత్సరంలో ఫిబ్రవరి 29న పుట్టినవారూ చాలా అరుదుగా కనిపిస్తారు. ఈ విషయంలో ఇక్కడ కనిపిస్తున్న పాప పుట్టినరోజు ఇంకాస్త భిన్నం.

అమెరికాలోని నార్త్‌ కరోలినాకు చెందిన అబెర్లీ స్పియర్ ఫిబ్రవరి 22న ఆడ శిశువుకు జన్మనిచ్చారు. ఇందులో విశేషమేముంది అంటారా? ఆ పాప జన్మించిన తేదీ 2/2/2022. సమయం రాత్రి 2.22 గంటలు. అంటే పుట్టిన తేదీ, నెల, సంవత్సరం, సమయం అన్నీ రెండ్లే. ఆఖరికి డెలివరీ రూమ్‌ నంబర్‌ కూడా రెండే. అప్పుడే అయిపోలేదు... ఆ పాప బరువు 7 పౌండ్ల 10 ఔన్సులు.. అంటే 122 ఔన్సులకు సమానం. అంటే ఇక్కడా రెండు అంకె మళ్లీ రిపీట్‌ అయ్యింది. ఇలా అరుదైన రోజున పుట్టిన ఈ పాపకు జుడా గ్రేస్ స్పియర్‌ అని నామకరణం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు