అంతర్జాతీయ క్వారంటైన్‌ నిబంధనలు సడలించిన ఆస్ట్రేలియా

అంతర్జాతీయ ప్రయాణీకులకు సంబంధించిన క్వారంటైన్‌ నియమాలను ఆస్ట్రేలియా సడలించనుంది.

Published : 29 Sep 2020 23:36 IST

కాన్‌బెర్రా: తమ దేశానికి వచ్చే అంతర్జాతీయ ప్రయాణీకులకు సంబంధించిన క్వారంటైన్‌ నియమాలను ఆస్ట్రేలియా సడలించనుంది. ‘కొవిడ్‌-19 సేఫ్‌’ దేశాల నుంచి ఇక్కడకు వచ్చే విదేశీ యాత్రికులు.. ఇంటి వద్దనే క్వారంటైన్‌ కాలాన్ని పూర్తి చేసే విధంగా నిబంధనల్లో మార్పు చేయనున్నట్టు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిసన్‌ నేడు ప్రకటించారు. ఆస్ట్రేలియాకు వచ్చే అంతర్జాతీయ ప్రయాణీకులు రెండు వారాల క్వారంటైన్‌ కాలాన్ని వారు దేశంలో అడుగుపెట్టిన ప్రాంతంలోని నిర్దేశిత హోటళ్లలో గడపాలనే నిబంధన మార్చి  నుంచి అమలులో ఉన్న సంగతి తెలిసిందే.

‘‘న్యూజిలాండ్‌, దక్షణ కొరియా, జపాన్‌, కొన్ని పసిఫిక్‌ సముద్ర దేశాలతో సహా కరోనా కట్టడిలో విజయవంతమైన కొన్ని దేశాల ప్రజలకు (ఆస్ట్రేలియా) సరిహద్దులు తెరవాలని నిర్ణయించుకున్నాము. ఈ నేపథ్యంలో వారికి మరింత అనుకూలమైన ప్రత్యామ్నాయ విధానాలు అనుసరించాల్సిన అవసరం ఉంది.’’ అని ఆయన తాజా ప్రకటనలో వెల్లడించారు. కాగా, కరోనా పరంగా ప్రమాదరహితమైన దేశాల నుంచి వచ్చే ప్రయాణీకులకు మాత్రమే ఈ వెసులుబాటు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని