‘కోవాగ్జిన్‌’ టీకా మరో ముందడుగు!

భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌)తో కలిసి హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న భారత్‌ బయోటెక్ సంస్థ కరోనా టీకా విషయంలో మరో ముందడుగు వేసింది. దేశీయంగా రెండు సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న ‘కోవాగ్జిన్‌’ మూడో దశ

Published : 23 Oct 2020 02:16 IST

దిల్లీ: భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌)తో కలిసి హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న భారత్‌ బయోటెక్ సంస్థ కరోనా టీకా విషయంలో మరో ముందడుగు వేసింది. దేశీయంగా రెండు సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న ‘కోవాగ్జిన్‌’ మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌కు డీసీజీఐ అనుమతించింది. ఈ మేరకు మీడియా వర్గాలు వెల్లడించాయి. కరోనా టీకా మూడో దశ ట్రయల్స్‌ అనుమతి కోసం భారత్‌ బయోటెక్‌ అక్టోబర్‌ 2న డీసీజీఐకి దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో 19 వేర్వేరు ప్రాంతాల్లో 18ఏళ్లకు పైబడిన వారిపై పరిశోధన చేయనున్నట్లు సంస్థ డీజీసీఐకి చేసిన దరఖాస్తులో తెలిపింది. మరోవైపు జైడస్‌ క్యాడిలా సంస్థ అభివృద్ధి చేస్తున్న కొవిడ్‌ టీకా సైతం రెండో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ కొనసాగిస్తోంది. పుణెకు చెందిన సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ఆస్ట్రాజెనికాతో కలిసి రూపొందిస్తున్న ఆక్స్‌ఫర్డ్‌ టీకా భారత్‌లో రెండు, మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌లో ఉంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని