రాజ్‌ఘాట్‌ వద్ద ప్రధాని మోదీ నివాళి

జాతిపిత మహాత్మాగాంధీ 151వ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ఘన నివాళులర్పించారు. ధిల్లీలోని రాజ్‌ఘాట్‌ను సందర్శించి పూలమాలతో అంజలి ఘటించారు. దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ప్రతి గ్రామం స్వయం సమృద్ధి సాధించాలన్న గాంధీజీ కలలను ‘ఆత్మనిర్భర భారత్‌’ ద్వారా సాకారం..

Updated : 02 Oct 2020 11:30 IST

దిల్లీ: జాతిపిత మహాత్మాగాంధీ 151వ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ఘన నివాళులర్పించారు. ధిల్లీలోని రాజ్‌ఘాట్‌ను సందర్శించి పూలమాలతో అంజలి ఘటించారు. దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ప్రతి గ్రామం స్వయం సమృద్ధి సాధించాలన్న గాంధీజీ కలలను ‘ఆత్మనిర్భర భారత్‌’ ద్వారా సాకారం చేస్తామన్నారు. గాంధీజీ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చని చెబుతూ ఆయన స్మృతులతో ఓ చిన్న వీడియోను ట్విటర్‌లో పోస్టు చేశారు.

‘‘ అక్టోబర్‌ 2 గాంధీజీ పుట్టిన రోజు మనందరికీ ఎంతో పవిత్రమైన, స్ఫూర్తిదాయకమైన రోజు. ఆయన ఆలోచనలు, ఆదర్శాలు ఇప్పటికీ బతికే ఉన్నాయి. నా జీవితమే నా సందేశం అని చెప్పారే తప్ప, తనని అనుసరించాలని ఆయన ఎప్పుడూ కోరుకోలేదు.కానీ, ఆయన జీవితం అందరికీ ఆదర్శమైంది.’’ అని మోదీ అన్నారు.  ప్రపంచమంతా ఓ కుటుంబమని గాంధీజీ నమ్మేవారని మోదీ చెప్పారు. సత్యం, అహింస ఆయుధాలుగా ఉద్యమాలను నడిపించారని గుర్తు చేశారు. ‘‘ దేశం ఆరోగ్యంగా ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని దీని కోసం పరిశుభ్రత ముఖ్యమని గాంధీజీ చెప్పేవారు. గాంధీజీ ఆలోచనలు మాలో స్ఫూర్తి నింపాయి. అందుకే స్వచ్ఛభారత్‌ నినాదాన్ని అందుకున్నాం. సమాజాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు ఆయన మాటలు మాకు మార్గనిర్దేశం చేశాయి. గాంధీజీ ప్రభావం మాపై ఎంతైనా ఉందని బలంగా నమ్ముతున్నాను.’’ అని మోదీ అన్నారు.

గాంధీ జీవితం నుంచి నేర్చుకోండి: రామ్‌నాథ్‌ కోవింద్‌

గాంధీజీ 151వ జయంతి సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నివాళులర్పించారు. రాజ్‌ఘాట్‌ను సందర్శించి గాంధీజీ సేవలను గుర్తు చేసుకున్నారు. గాంధీజీ జీవితాన్ని అనుసరించి మన ప్రాధాన్యాలను ఎంచుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆయన మాటలు ప్రజల గుండెల్లో నిత్యం మారుమోగాలని అన్నారు. 



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని