బీరుట్ సగం వైద్యశాలలు మూత ..!
లెబనాన్ రాజధాని బీరుట్లో భారీ పేలుడు తర్వాత పరిస్థితి నానాటికి దిగజారుతోంది. నగరానికి అవసరమైన ఆహార ధాన్యాల గోదాము ఓడరేవులోనే ఉండటంతో ధ్వంసమైపోయింది. నోటి వద్ద ఆహారం నీటిపాలైంది. ఆ పేలుడు తీవ్రతకు
ఇంటర్నెట్‌డెస్క్: లెబనాన్ రాజధాని బీరుట్లో భారీ పేలుడు తర్వాత పరిస్థితి నానాటికి దిగజారుతోంది. నగరానికి అవసరమైన ఆహార ధాన్యాల గోదాము ఓడరేవులోనే ఉండటంతో ధ్వంసమైపోయింది. నోటికందాల్సిన ఆహారం నీటిపాలైంది. ఈఘటనలో దాదాపు 5,000 మంది గాయపడ్డారు. కానీ, వీరికి చికిత్సను అందించేందుకు తగినన్ని ఆసుపత్రులు అందుబాటులో లేవు. పులిమీద పుట్రలాగా.. నగరంలోని దాదాపు సగం ఆసుపత్రులు పనికిరాని స్థితికి చేరుకొన్నాయి.
నగరంలోని ఆసుపత్రుల్లోని ఎమర్జెన్సీ గదులు నిరుపయోగంగా మారాయి. చాలా ఆసుపత్రుల్లో పరికరాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. ఈ విషయాన్ని సాక్షాత్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థే వెల్లడించింది. బీరుట్లో మొత్తం 55 క్లీనిక్‌లు ఉన్నాయి. వీటిల్లో సగం పనిచేయడం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ రీజనల్ డైరెక్టర్ రిచర్డ్ బ్రెన్నన్ తెలిపారు. వీటిల్లో మూడు పెద్ద ఆసుపత్రులు కూడా ఉన్నాయన్నారు. మృతుల సంఖ్య 170ని దాటినట్లు సమాచారం.
గతేడాది నుంచి దేశంలో ఆర్థిక సంక్షోభం ఉండటంతో ఆ ప్రభావం ఆసుపత్రులపై కూడా పడింది. అత్యవసరాల్లో వినియోగించే పరికరాల కొరత తీవ్రంగా ఉంది. ఇక ప్రభుత్వ ఆసుపత్రులు చెల్లింపులే మిలియన్ల డాలర్లలో ఉన్నట్లు సమాచారం. ఇప్పుడు పేలుడు కారణంగా ఉన్న అరకొర పరికరాలు దెబ్బతిన్నాయి. సాధారణ రోజుల్లో దాదాపు రెండు నెలలకు సరిపడా వైద్య పరికరాలను పేలుడు జరిగిన తొలిరోజే వాడాల్సి వచ్చిందని రెడ్‌క్రాస్ బృందం వెల్లడించింది. దీంతో చాలా మంది బాధితులకు చికిత్స అందలేదు. తాజాగా లెబనాన్‌లో జరుగుతున్న ఆందోళనల్లో శరీర గాయాల పచ్చి ఆరకుండానే చాలా మంది పాల్గొంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్‌ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్‌లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్‌లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్‌కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్‌కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రతి మ్యాచ్‌లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం