మడమతిప్పని ఉద్యమ పోరు

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో రైతుల ఉద్యమం బుధవారంతో 28వ రోజుకు చేరుకుంది. నానాటికీ ఉష్ణోగ్రతలు పడిపోతూ చలి తీవ్రత పెరిగిపోతున్నా....

Published : 23 Dec 2020 11:54 IST

28వ రోజుకు చేరిన రైతు నిరసనలు

దిల్లీ: రైతుల దినోత్సవాన్ని పురస్కరించుకొని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నదాతలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి ఆహారాన్ని అందిస్తున్న ప్రతి రైతుకు ట్విటర్‌ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. కొందరు రైతు సంఘాల నాయకులతో చర్చలు జరుపుతున్నామని.. త్వరలోనే రైతులు నిరసనలు విరమిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో ఉద్యమం బుధవారంతో 28వ రోజుకు చేరుకుంది. నానాటికీ ఉష్ణోగ్రతలు పడిపోతూ చలి తీవ్రత పెరిగిపోతున్నా మడమ తిప్పని కర్షకులు తమ నిరసన దీక్షలు కొనసాగిస్తున్నారు. నూతన చట్టాలను రద్దు చేయకుంటే ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని వెల్లడించారు. ఈనెల 26, 27, 28వ తేదీల్లో హరియాణాల్లోని టోల్‌ప్లాజాల్లో వసూళ్లను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. 

కేంద్రం పలుమార్లు రైతులతో చర్చలు జరిపినప్పటికీ అవి సఫలం కావడంలేదు. మంగళవారం జరగాల్సిన చర్చలు నేటికి వాయిదా పడ్డాయి. రైతు సంఘాలు నేడు మరోసారి కేంద్రంతో మంతనాలు జరపనున్నాయి. కాగా, రైతు చట్టాలపై కేంద్ర వైఖరిని పలువురు ప్రముఖులు, పలు రాజకీయ పార్టీలు తప్పుబడుతున్నారు. ఈ వ్యవహారంలో రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని.. రెండు కోట్ల సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని రాష్ట్రపతికి సమర్పించనున్నట్లు కాంగ్రెస్‌ వెల్లడించింది. నూతన వ్యవసాయ చట్టాలను తొలగించాలని జరుగుతున్న ఉద్యమంపై రైతు సంఘాలు నేడు మధ్యాహ్నం ప్రముఖులతో వెబినార్‌ నిర్వహించనున్నాయి.

రైతు దినోత్సవం సందర్భంగా వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నేడు నిరాహార దీక్ష చేపట్టాలని నిర్ణయించుకున్నారు. పలు పార్టీలు రైతులకు మద్దతుగా నిలిచాయి. రైతులకు సంఘీభావంగా ఉపవాసం పాటించాలని పంజాబ్‌లోని శిరోమణి అకాలీదళ్ తమ కార్యకర్తలను కోరింది. ఉత్తరప్రదేశ్‌లో నిరసనలు చేపట్టాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది.

ఇవీ చదవండి...

కేంద్రంతో చర్చలపై నిర్ణయం వాయిదా

రైతన్నల తలకు మసాజ్‌ చేసిన కబడ్డీ ఆటగాళ్లు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని