రష్యాలో 60ఏళ్లు పైబడిన వారికీ స్పుత్నిక్‌ టీకా

60ఏళ్లు పైబడిన వారికీ ఇకపై స్పుత్నిక్‌ టీకాను అందించేందుకు రష్యా అనుమతించింది.

Published : 26 Dec 2020 20:02 IST

మాస్కో: 60ఏళ్లు పైబడిన వారికీ ఇకపై స్పుత్నిక్‌ టీకాను అందించేందుకు రష్యా అనుమతించింది. రష్యాలో అత్యవసర వినియోగం కింద స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌ను అక్కడి ఔషధ నియంత్రణ సంస్థ అనుమతిచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే దాదాపు రెండు లక్షలమందికి పైగా టీకాను పంపిణీ చేశారు. వారిలో 60ఏళ్లు పైబడిన వారికి టీకాను అనుమతించలేదు. ఆ వయసు వారిపై ఈ టీకాను విడిగా పరీక్షించారు. ఈ ప్రయోగ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు నమోదు చేయడంతో రష్యా ఆరోగ్య శాఖ మంత్రి  టీకాను అందరికీ అనుమతిస్తూ శనివారం ఆదేశాలు జారీ చేశారు. కాగా రష్యా ప్రభుత్వం 3 లక్షల స్పుత్నిక్‌ టీకాలను అర్జెంటీనాకు పంపారు. రష్యా వ్యాప్తంగా టీకా పంపిణీ కార్యక్రమం జరుగుతుండటంతో దేశంలోని అన్ని ప్రాంతాలకు ఇప్పటికే టీకాలను పంపారు. ఈ స్పుత్నిక్‌-వి టీకా ఎగుమతికి సంబంధించి రష్యా ఇప్పటికే చాలా దేశాలతో ఒప్పందాలు చేసుకుంది. ఇప్పటికే అర్జంటీనా, బెలారస్‌లు తమ దేశాల్లో స్పుత్నిక్‌ టీకా వినియోగాన్ని అనుమతించారు.

ఇవీ చదవండి..

కరోనా ఎఫెక్ట్‌: 2021లో వీటిపై దృష్టి పెట్టాల్సిందే..

నాకు ప్రజాస్వామ్య పాఠాలు నేర్పుతున్నారు:మోదీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని