అయోధ్యలో కరోనా కలకలం

రామ మందిరం నిర్మాణానికి భూమిపూజ ముహూర్తం సమీపిస్తున్న వేళ అయోధ్య నగరంలో......

Updated : 30 Jul 2020 15:59 IST

పూజారి, 14మంది పోలీసులకు పాజిటివ్‌


అయోధ్య: రామ మందిరం నిర్మాణానికి భూమిపూజ ముహూర్తం సమీపిస్తున్న వేళ అయోధ్య నగరంలో కరోనా వైరస్‌ కలకలం రేపుతోంది. రామ మందిరంలో  ప్రధాన పూజారి సహాయకుడిగా ఉన్న పూజారి ప్రదీప్‌దాస్‌ కొవిడ్‌ బారిన పడ్డారు. దీంతో ఆయన్ను హోం క్వారంటైన్‌లో ఉంచారు. అలాగే, ఆలయం వద్ద విధులు నిర్వహిస్తున్న 14 మంది పోలీసు సిబ్బందికి సైతం పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు ట్రస్టు వెల్లడించింది. 

ఆగస్టు 5న జరగబోయే రామ మందిరం శంకుస్థాపన కార్యక్రమం నేపథ్యంలో అయోధ్య నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ సహా 50మంది ప్రముఖులు విచ్చేస్తున్న సందర్భంగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు, కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో అన్ని భద్రతా చర్యలు తీసుకొని కార్యక్రమాన్ని నిర్వహించాలని భావిస్తున్నట్టు ఆలయ ట్రస్ట్‌ తెలిపింది. కొందరు అతిథులు, పూజారులు, భద్రతా సిబ్బంది, స్థానికులతో కలిపి మొత్తం 200 మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారని పేర్కొంది.

ఇదీ చదవండి..

అయోధ్యానగరి శోభాయమానం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని