పారిస్‌ ఒప్పందం నుంచి అమెరికా బయటకు..!

నేడు అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. నేడే అమెరికా పారిస్‌ ఒప్పందం నుంచి బయటకు వచ్చేసింది. అధ్యక్షుడిగా ట్రంప్‌ తీసుకొన్న అత్యంత వివాదాస్పద

Published : 04 Nov 2020 15:52 IST

ఇంటర్నె్‌ట్‌డెస్క్‌: నేడు అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. నేడు అమెరికా పారిస్‌ ఒప్పందం నుంచి బయటకు వచ్చేసింది. అధ్యక్షుడిగా ట్రంప్‌ తీసుకొన్న అత్యంత వివాదాస్పద నిర్ణయాల్లో ఇది కూడా ఒకటి. ఈ నిర్ణయం 2017లో తీసుకొన్నా.. ఇది నేటి నుంచి అధికారికంగా అమల్లోకి వచ్చింది. మళ్లీ అమెరికా ఈ ఒప్పందంలో చేరాలని భావిస్తే మాత్రం చేరవచ్చు.

పారిస్‌ ఒప్పందాన్ని 2015లో ప్రారంభించారు. వాతావరణంలో వచ్చే పెనుమార్పులను అడ్డుకొనేందుకు కాలుష్యాన్ని తగ్గించాలన్నది దీని లక్ష్యం. ముఖ్యంగా భూతాపాన్ని 2 సెంటీగ్రేడ్లు తగ్గించాలన్నది దీని లక్ష్యం. ట్రంప్‌ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత దీనిని నుంచి వైదలగాలని నిర్ణయించారు. 2017లో దీనికి సంబంధించిన ప్రకటన వెలువడింది. కానీ, ఈ ఒప్పందంలోని క్లిష్టమైన నిబంధనల కారణంగా మూడేళ్ల సమయం పట్టింది. భవిష్యత్తులో అమెరికా వంటి దేశాలు ఈ ఒప్పందం నుంచి ఒక్కసారిగా బయటకు వెళితే కష్టమవుతుంది. అందుకే అటువంటి ప్రక్రియను పూర్తి చేయడానికి కొంత సమయం పట్టేలా నిబంధనలు తయారు చేశారు. వాటి సమయం అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడే రోజే ముగియడం యాదృచ్ఛికమం. 

ఇవీ చదవండి

ఇది గెలిస్తేనే ‘ట్రంప్‌’లకు ఫ్యూచర్‌..!

భారత్ మ్యాప్‌ను తప్పుగా చూపిన Jr.ట్రంప్

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని