కరోనా కాలం.. అక్కడి వృద్ధులకు అలారం

చైనా నుంచే కరోనా వైరస్‌ ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందిన విషయం తెలిసిందే. దీంతో అమెరికాలో చైనీయులపై అమెరికన్లు కర్కశంగా వ్యవహరించడం.. వేధింపులకు గురి చేయడం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో న్యూయార్క్‌ సిటీలోని

Published : 27 Aug 2020 00:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి చైనాలో వెలుగుచూసిన సంగతి తెలిసిందే. దీంతో అమెరికాలో చైనీయులను వేధించడం, దాడులకు పాల్పడటం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయట. ఈ నేపథ్యంలో న్యూయార్క్‌ సిటీలోని చైనా టౌన్‌లో వృద్ధ చైనీయుల రక్షణ కోసం అక్కడి యువత ఒక విధమైన అలారం పరికరాలను తయారు చేయిస్తోంది.

కరోనా వ్యాప్తికి చైనా దేశం కారణమంటూ అమెరికాలో ఉండే చైనీయులపై అక్కడి ప్రజలు వివక్ష చూపిస్తున్నారట. వారి వల్లే అమెరికాలోకి కరోనా ప్రవేశించిందని ఆరోపిస్తూ భౌతిక దాడులకు కూడా పాల్పడుతున్నారట. ఇలాంటి ఘటనలను చూసిన న్యూయార్క్‌ చైనా టౌన్‌లోని కొందరు యువతీయువకులు వృద్ధుల రక్షణ గురించి ఆలోచించారు. వయసులో ఉన్నవారు దాడిని ప్రతిఘటించే అవకాశముంది. కానీ వృద్ధులను కాపాడటం ఎలా అనే సమస్యకు పరిష్కారం ఆన్వేషించారు. దానికి ఫలితమే ఈ అలారం పరికరం. ఇందుకోసం మార్చిలో చైనా టౌన్‌లోని యువతీయువకులు స్థానికులకు సమస్యను వివరించి పరికరం తయారీకి ఆర్థిక సాయం కోరారు. అక్కడి ప్రజలు సహాయం చేయడంతో ‘సేఫ్‌ ఫ్రమ్‌ హేట్‌’ కార్యక్రమం చేపట్టారు.

ఇందులో భాగంగా ఈ పరికరాలను తయారు చేయించి.. వృద్ధులకు పంపిణీ చేస్తున్నారు. వాటిని ఎలా ఉపయోగించాలో నేర్పిస్తున్నారు. ఈ అలారం పరికరాన్ని వృద్ధులు ఎల్లప్పుడు వారి వద్దనే ఉంచుకోవాలి. దుండగులు దాడి చేసేందుకు వస్తే వెంటనే ఈ పరికరంలోని మీట నొక్కాలి. అది నొక్కగానే దాదాపు 125 డెసిబుల్స్‌తో శబ్దం వినిపిస్తుందట. ఆ శబ్దానికి దుండగులు కాస్త బెదిరిపోయి అచేతనంగా ఉండిపోతారని, ఆ సమయంలో వారి నుంచి తప్పించుకొని బయటకు రావొచ్చని చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని