Kejriwal: ఎన్ని కుట్రలు చేసినా..‘మా దోస్తీ’ ఎప్పటికీ చెదరనిది: సిసోదియాకు కేజ్రీవాల్‌ విషెస్‌

ఆమ్‌ ఆద్మీపార్టీ నేత మనీశ్‌ సిసోదియా (Manish Sisodia)తో ఉన్న స్నేహం ఎంతో పాతదని.. కుట్రదారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ‘మా దోస్తీ’ని ఎప్పటికీ విచ్ఛిన్నం చేయలేరని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) అన్నారు.

Updated : 05 Jan 2024 15:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆమ్‌ ఆద్మీపార్టీ నేత మనీశ్‌ సిసోదియా (Manish Sisodia) పుట్టిన రోజు సందర్భంగా దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తమ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం, విశ్వాసం చాలా బలమైందని పేర్కొన్నారు. గతంలో సిసోదియాతో కలిసి ఓ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఫొటోను ‘ఎక్స్‌’లో షేర్‌ చేస్తూ కేజ్రీవాల్‌ స్పందించారు.

‘మా స్నేహం చాలా పాతది. మా మధ్య ఉన్న అనుబంధం, విశ్వాసం కూడా చాలా బలమైంది. ప్రజల కోసం పని చేయాలనే అభిరుచి కూడా చాలా కాలంనాటిది. కుట్రదారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఈ విశ్వాసం, ఆప్యాయత, స్నేహం ఎప్పటికీ చెదిరిపోదు’ అని అరవింద్‌ కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. సిసోదియా జైలుకు వెళ్లడాన్ని ప్రస్తావిస్తూ భాజపాపై మండిపడ్డారు.

మరో నౌక హైజాక్‌.. అందులో 15 మంది భారతీయులు!

‘భాజపా తప్పుడు కేసులు నమోదు చేసి సిసోదియాను 11 నెలలుగా జైల్లోనే ఉంచింది. కానీ, వారి అణచివేతను మనీశ్‌ దీటుగా ఎదుర్కొంటున్నారు. ఇప్పటివరకు వారి నియంతృత్వానికి తలవంచలేదు, భవిష్యత్తులోనూ తలొగ్గరు. ఇటువంటి సమయంలో మనీశ్‌ చూపిస్తున్న తెగువ మనందరికీ స్ఫూర్తిగా నిలుస్తోంది’ అని కేజ్రీవాల్‌ పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే, దిల్లీ మద్యం విధానంలో దిల్లీ మాజీ ఉప ముఖ్య మంత్రి మనీశ్‌ సిసోదియా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. దాదాపు సంవత్సర కాలంగా జైల్లోనే ఉన్నారు. ఇదే కేసులో ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఇటీవల పలుమార్లు సమన్లు జారీచేసింది. తనను అరెస్టు చేసి.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం చేయనీయకుండా అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని కేజ్రీవాల్‌ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని