Aryan Khan: ఆర్యన్‌ తరచూ డ్రగ్స్‌ తీసుకునేవాడు.. బాంబే కోర్టుకు తెలిపిన ఎన్సీబీ

డ్రగ్స్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటుడు షారుక్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ తరచూ డ్రగ్స్‌ తీసుకునే వాడని నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) బాంబే హైకోర్టుకు తెలిపింది.

Updated : 28 Oct 2021 16:17 IST

ముంబయి: డ్రగ్స్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటుడు షారుక్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ తరచూ డ్రగ్స్‌ తీసుకునే వాడని నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) బాంబే హైకోర్టుకు తెలిపింది. అతడికిదే మొదటి సారి కాదని, గత ఐదేళ్లుగా డ్రగ్స్‌ వినియోగిస్తున్నట్లు ఎన్‌సీబీ తరఫు న్యాయవాది అదనపు సొలిసిటర్‌ జనరల్‌ అనిల్‌ సింగ్‌ కోర్టుకు తెలిపారు. డ్రగ్స్ కేసులో బెయిల్‌ కోసం రెండో రోజైన గురువారం సైతం విచారణ జరిగింది. నిందితుల తరఫున బుధవారం వాదనలు విన్న జస్టిస్‌ ఎన్‌.డబ్ల్యూ.సంబ్రే నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం.. గురువారం ఎన్సీబీ వాదనలు వింటోంది.

విచారణ సందర్భంగా ఎన్‌సీబీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఆర్యన్‌, అర్బాజ్‌ ఇద్దరూ గత కొన్నేళ్లుగా డ్రగ్స్‌ తీసుకుంటున్నారని ధర్మాసనానికి తెలిపారు. వారిద్దరూ బల్క్‌గా డ్రగ్స్ కొనుగోలు చేస్తుంటారని, డ్రగ్స్‌ సరఫరా చేసేవారితో నిత్యం సంబంధాలు నెరుపుతుంటారని పేర్కొన్నారు. అలాగే ఆర్యన్‌ఖాన్‌ వద్ద విక్రయించడానికి తగినంత డ్రగ్స్‌ ఉన్నాయని కోర్టుకు తెలిపారు. అయితే, దాన్ని ఎలా నిర్ధారించారని కోర్టు ప్రశ్నించగా.. వాట్సాప్‌ చాట్స్‌ ఆధారంగా తమకు తెలిసిందని అనిల్‌ సింగ్‌ పేర్కొన్నారు. అలాగే, ఎన్‌డీపీఎస్‌ చట్టం ప్రకారం బెయిల్‌ అనేది రూల్‌ ఏమీ కాదని అనిల్‌ సింగ్‌ కోర్టుకు తెలిపారు. ఈ సందర్భంగా ఓ కేసు తీర్పును ఉదహరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని