Brinda Karat: బుల్‌డోజర్లను అడ్డుకున్న బృందా కారాట్‌

రాజధానిలోని జహంగీర్‌పురా ప్రాంతంలో స్పెషల్‌ డ్రైవ్‌ పేరిట జరుగుతున్న నిర్మాణాల కూల్చివేతను నిలిపివేయాలని సుప్రీం ఇచ్చిన ఆదేశాలు..

Updated : 20 Apr 2022 17:17 IST

దిల్లీ: రాజధానిలోని జహంగీర్‌పురి ప్రాంతంలో స్పెషల్‌ డ్రైవ్‌ పేరిట జరుగుతున్న నిర్మాణాల కూల్చివేతను నిలిపివేయాలని సుప్రీం ఇచ్చిన ఆదేశాలు చూపిస్తూ సీపీఎం నేత బృందా కారాట్‌ బుల్‌డోజర్లకు అడ్డుగా నిలిచారు. ఉత్తర దిల్లీ మున్సిపల్‌ పౌరసంఘం జారీ చేసిన ఈ ఆక్రమణల వ్యతిరేక డ్రైవ్‌ను సంబంధిత అధికారులు ఆపడానికి నిరాకరించారు. తమకు పై నుంచి ఎలాంటి ఆదేశాలు అందలేదని నిర్మాణాలను కూల్చివేయడం కొనసాగించారు. దీంతో రెండు గంటల పాటు ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హనుమాన్‌ జయంతి  రోజు ఊరేగింపు సందర్భంగా సంబంధిత ప్రాంతంలో మతపరమైన ఘర్షణలు చోటుచేసుకున్నాయి. అనంతరం అక్రమ కట్టడాలను కూల్చివేయాలని నగరపాలక అధికారులు నిర్ణయించారు.  ఈ కూల్చివేతలపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. న్యాయస్థానం ఆ కూల్చివేతలను నిలిపివేయాల్సిందిగా ఆదేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని