Cow Hug day: ఫిబ్రవరి 14 వాలంటైన్స్ డే కాదు.. కౌ హగ్ డే..!
Cow Hug Day on Feb 14: ఫిబ్రవరి 14న కౌ హగ్ డేగా జరుపుకోవాలని ప్రజలకు భారత జంతు సంరక్షణ బోర్డు సూచించింది. అలా చేయడం వల్ల ఎన్నో మంచి ఫలితాలు ఉంటాయని పేర్కొంది.
దిల్లీ: ఫిబ్రవరి 14.. మనందరికీ గుర్తొచ్చేది ప్రేమికుల రోజే (Valentines Day). ప్రేమలో ఉన్న యువతీ యువకులు బహుమతులిచ్చి ఒకరిని ఒకరు సర్‌ప్రైజ్ చేసుకుంటారు. మరికొందరు అదే రోజు మన ప్రేమను వ్యక్త పరుస్తుంటారు. అయితే, ప్రేమికుల రోజు అనేది మన సంప్రదాయం కాదని, దాన్ని వీడాలని చెప్పేవారూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 14ను కౌ హగ్ డేగా (Cow Hug Day) జరుపుకోవాలని యానిమల్ వెల్ఫేర్ బోర్డు ఆఫ్ ఇండియా భారత ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
గోమాత ప్రాధాన్యతను గుర్తించి గో ప్రేమికులంతా ఫిబ్రవరి 14 రోజున ఆవులను ఆలింగనం చేసుకోవాలని పశుసంవర్థక, పాడిపరిశ్రమ విభాగానికి చెందిన జంతు సంరక్షణ బోర్డు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. గోవులు భారత సంస్కృతీ సంప్రదాయాలకు, గ్రామీణ ఆర్థిక వ్యస్థకు వెన్నెముక అని పేర్కొంది. అలాంటి గోవులను ఆలింగనం చేసుకోవడం ద్వారా దేహంలోకి సానుకూల శక్తి ప్రవహించడంతో పాటు మానసికోల్లాసం కలుగుతుందని పేర్కొంది. వేదాల్లో వీటి ప్రస్తావన ఉన్నప్పటికీ.. పాశ్చాత్య నాగరికత ప్రభావంతో మనం మరిచిపోతున్నామని ఆవేదన వ్యక్తంచేసింది. కాబట్టి గో ప్రేమికులంతా ‘కౌ హగ్ డే’ను జరుపుకోవాలని విజ్ఞప్తి చేసింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
NTPC: ఎన్టీపీసీ తెలంగాణ ప్రాజెక్ట్‌లో ఉత్పత్తి ప్రారంభం
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Politics News
Sajjala: ఆ ఇద్దరు ఎమ్మెల్యేలూ ఎవరో గుర్తించాం : సజ్జల
-
Ap-top-news News
Rains: వచ్చే మూడు రోజుల్లో మోస్తరు వర్షాలు
-
Politics News
Andhra News: మండలిలో మారనున్న బలాబలాలు
-
Ap-top-news News
Justice Battu Devanand : జస్టిస్ బట్టు దేవానంద్ మద్రాస్ హైకోర్టుకు బదిలీ