Delhi Liquor scam: మనీశ్‌ సిసోదియాకు మరోసారి బెయిల్‌ నిరాకరణ

దిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోదియాకు దిల్లీ హైకోర్టులో మరోసారి నిరాశ ఎదురైంది. ఆయన బెయిల్‌ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది.

Published : 03 Jul 2023 16:09 IST

దిల్లీ: మద్యం కుంభకోణం కేసులో మనీలాండరింగ్‌ ఆరోపణలపై అరెస్టయిన దిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP) నేత మనీశ్ సిసోదియా (Manish Sisodia)కు దిల్లీ హైకోర్టు(Delhi High court)లో మరోసారి నిరాశే ఎదురైంది. ఆయన దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం సోమవారం కొట్టివేసింది. ఈ దశలో బెయిల్‌ మంజూరు చేయలేమని న్యాయమూర్తి తేల్చి చెప్పారు. సిసోదియాతో పాటు ఇదే కేసులో సహ నిందితులుగా ఉన్న అభిషేక్‌ బోయినపల్లి, వినయ్‌బాబు, విజయ్‌ నాయర్‌కు సైతం బెయిల్‌ ఇచ్చేందుకు నిరాకరించారు.

మద్యం కుంభకోణం కేసులో మనీశ్ సిసోదియాను ఫిబ్రవరి 26న సీబీఐ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత  ఈ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై మే 9న ఈడీ అధికారులు అరెస్టు చేసి తిహాడ్‌ జైలులోనే విచారించారు. ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు. గతంలో మే 30న బెయిల్‌ కోసం దిల్లీ హైకోర్టును ఆశ్రయించగా నిరాశ ఎదురవ్వగా..  తాజాగా మరోసారి ఆయన దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు