Shraddha Walkar murder case: శ్రద్ధావాకర్‌ హత్య కేసులో 3,000 పేజీల ఛార్జిషీట్‌..!

Shraddha Walkar murder case: శ్రద్ధవాకర్‌ హత్యకేసులో పోలీసులు అత్యంత జాగ్రత్తగా ఛార్జిషీట్‌ను సిద్ధం చేస్తున్నారు. దీనిపై న్యాయనిపుణుల సలహాలు తీసుకొంటున్నారు.

Updated : 22 Jan 2023 19:34 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్‌ హత్యకేసు(Shraddha Walkar murder case)లో విచారణ కొలిక్కి వస్తోంది. పోలీసులు ఇప్పటికే కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో 3,000 పేజీల డ్రాఫ్ట్‌ ఛార్జిషీట్‌ను సిద్ధం చేశారు. ఫోరెన్సిక్‌, ఎలక్ట్రానిక్‌ ఆధారాలు, 100 మంది సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేశారు. వీటి ఆధారంగా తుది ఛార్జిషీట్‌కు ఓ రూపు ఇవ్వనున్నారు. అంతేకాదు.. ఆఫ్తాబ్‌ అంగీకార వాంగ్మూలం, నార్కో పరీక్షల నివేదికను కూడా దీనికి జతచేయనున్నారు. ప్రస్తుతం ఇది న్యాయనిపుణుల సమీక్షలో ఉంది. ఈ నెలాఖరుకు దీనిని న్యాయస్థానంలో దాఖలు చేసే అవకాశాలున్నాయి. మరోవైపు అఫ్తాబ్‌ నుంచి సేకరించిన సమాచారం మేరకు పోలీసులు  దక్షిణ దిల్లీలోని పలు చోట్ల నుంచి ఇప్పటికే 13 మానవ ఎముకలను స్వాధీనం చేసుకొన్నారు. వాటి డీఎన్‌ఏలు కూడా శ్రద్ధా తండ్రి డీఎన్‌ఏతో సరిపోలాయి.

అఫ్తాబ్‌ ఎప్పటి నుంచో తన కుమార్తెను హింసిస్తున్నా.. పోలీసులు చర్యలు తీసుకోలేదని శ్రద్ధా తండ్రి వికాస్‌ గత వారం వాపోయారు. 2020లో శ్రద్ధా తొలిసారి ఫిర్యాదు చేసినప్పుడే చర్యలు తీసుకొంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. మరో వైపు శ్రద్ధా అదృశ్యంపై తాను మనిక్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా వెంటనే స్పందించలేదని వికాస్‌ వెల్లడించారు. ఈ మేరకు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వాసి డిప్యూటీ పోలీస్‌ కమిషనర్‌ ఈ ఫిర్యాదుపై దర్యాప్తు చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని