రైతులు అర్థం చేసుకుంటారు: తోమర్‌

కేంద్రం నూతన వ్యవసాయ చట్టాలను తీసుకురావడానికి గల కారణాలను రైతు సంఘాలు తప్పక అర్థం చేసుకుంటాయని భావిస్తున్నట్లు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ అన్నారు. అంతేకాకుండా సానుకూల చర్చలతోనే సమ

Published : 06 Jan 2021 21:53 IST

దిల్లీ: కేంద్రం నూతన వ్యవసాయ చట్టాలను తీసుకురావడానికి గల కారణాలను రైతు సంఘాలు తప్పక అర్థం చేసుకుంటాయని ఆశిస్తున్నట్టు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ అన్నారు. అంతేకాకుండా సానుకూల చర్చలతోనే సమస్యలకు పరిష్కారం చేకూరుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మేరకు తోమర్‌ మంగళవారం దిల్లీలో విలేకరులతో మాట్లాడారు. 

‘రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికే ప్రభుత్వం వ్యవసాయ రంగంలో సంస్కరణలకు తావు ఇచ్చింది. అందులో భాగంగానే నూతన వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. ఈ చట్టాలను వ్యతిరేకిస్తున్న వారితో పాటు, మద్దతు పలుకుతున్న వారితోనూ మేం సమావేశమయ్యాం. వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులు చట్టాలను తీసుకురావడానికి గల కారణాలను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సానుకూల చర్చల ద్వారానే సమస్యలకు పరిష్కారం లభిస్తుంది’ అని తోమర్‌ పేర్కొన్నారు.

కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో నవంబర్‌ 26 నుంచి రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. కాగా మంగళవారం కేంద్రంతో చర్చలు జరిపిన రైతు సంఘాలు ప్రతిష్టంభన వీడకపోవడంతో.. తమ నిరసనల్ని తీవ్రం చేస్తున్నట్లు వెల్లడించాయి. అంతేకాకుండా భారతీయ జనతా పార్టీని, ఎన్డీయే కూటమి పార్టీలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించాయి. మరోవైపు జనవరి 7న దిల్లీ సరిహద్దుల్లో ట్రాక్టర్‌ మార్చ్‌ ఉంటుందని పేర్కొన్నాయి. 

ఇదీ చదవండి

ఆక్టోపస్‌ అమ్ముల పొదిలో ఆధునిక అస్త్రాలు
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని