హెలికాప్టర్‌ ప్రమాదంలో ఒలివియర్‌ డస్సాల్ట్‌ మృతి

ఫ్రెంచ్‌ బిలియనీర్‌, ఎంపీ ఒలివియర్‌ డస్సాల్ట్‌ ‌(69) హెల్‌కాప్టర్‌ ప్రమాదంలో మృతిచెందారు. వాయువ్య ఫ్రాన్స్‌లోని నార్మండి ప్రాంతంలో ఆ దేశ కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం ఆరుగంటలకు హెలికాప్టర్‌ కుప్పకూలినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ ఘటనలో పైలెట్‌ కూడా చనిపోయాడు. ఒలివియర్‌

Updated : 08 Mar 2021 06:39 IST

ప్యారిస్‌: ఫ్రెంచ్‌ బిలియనీర్‌, ఎంపీ ఒలివియర్‌ డస్సాల్ట్‌ ‌(69) హెల్‌కాప్టర్‌ ప్రమాదంలో మృతిచెందారు. వాయువ్య ఫ్రాన్స్‌లోని నార్మండి ప్రాంతంలో ఆ దేశ కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం ఆరుగంటలకు హెలికాప్టర్‌ కుప్పకూలినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ ఘటనలో పైలెట్‌ కూడా చనిపోయాడు. ఒలివియర్‌ మృతిపట్ల ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్‌ మాక్రాన్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన మృతి తీరని లోటని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు. ఘటన జరిగిన సమయంలో హెలికాప్టర్‌లో పైలెట్‌తో పాటు ఒలివియర్‌ ఒక్కరే ఉన్నారు. 

ఒలివియర్‌ తాత మార్సెల్‌ డస్సాల్ట్‌ ప్రపంచంలో పేరొందిన డస్సాల్ట్‌ ఏవియేషన్‌ను నెలకొల్పారు. భారత్‌కు రఫేల్‌ యుద్ధవిమానాలు తయారు చేసి అందించింది కూడా వీరి సంస్థే.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని