అమెరికా చర్యని తిప్పికొడతాం: రౌహానీ

తమ దేశ నిఘా విభాగం అధిపతి జనరల్‌ ఖాసీం సోలెమన్‌ హత్య నేపథ్యంలో అమెరికాపై ఇరాన్‌ అధ్యక్షుడు హసన్‌ రౌహానీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇరాన్‌ సహా ఈ ప్రాంతంలోని..........

Published : 03 Jan 2020 14:12 IST

టెహ్రాన్‌: తమ దేశ నిఘా విభాగం అధిపతి జనరల్‌ ఖాసీం సోలెమన్‌ హత్య నేపథ్యంలో అమెరికాపై ఇరాన్‌ అధ్యక్షుడు హసన్‌ రౌహానీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇరాన్‌ సహా ఈ ప్రాంతంలోని ఇతర దేశాలు అమెరికాపై తీవ్ర స్థాయిలో ప్రతీకారం తీర్చుకుంటాయని హెచ్చరించారు. నేరపూరితమైన అమెరికా చర్యని తప్పకుండా తిప్పికొడతామన్నారు. ఈ మేరకు ఆయన తన సందేశాన్ని ఆ దేశ అధికార వెబ్‌సైట్‌లో ఉంచారు. 

మరోవైపు సోలెమన్‌ హత్య నేపథ్యంలో ఇరాక్‌ వీధుల్లో ప్రభుత్వ వ్యతిరేకదారులు సంబరాలు జరుపుకొంటున్నారని మీడియా కథనాలు వెలువడుతున్నాయి. గత కొన్ని నెలలుగా బాగ్దాద్‌లో వారి ఆందోళనలకు వేదికగా మారిన తాహిర్‌ స్క్వేర్‌లో సంబరాలు జరుపుకొంటున్నారని సమాచారం. నినాదాలు చేస్తూ.. ఇరాక్‌ జాతీయ పతాకాలతో ఊరేగింపు నిర్వహించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే విషయాన్ని అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో సైతం ట్విటర్‌ వేదికగా వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని