ఇరాక్‌  నుంచి వచ్చేయండి..

అమెరికా, ఇరాన్‌ పరస్పర దాడులతో ఇరాక్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తాజా పరిస్థితుల దృష్ట్యా భారత్‌ సహా ప్రపంచ దేశాలన్నీ అప్రమత్తమయ్యాయి. ఇరాక్‌లో ఉంటున్న తమ

Published : 08 Jan 2020 17:51 IST

విమానాలు, ఓడలు పంపుతున్న ఫిలిప్పీన్స్‌

మనీలా: అమెరికా, ఇరాన్‌ పరస్పర దాడులతో ఇరాక్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తాజా పరిస్థితుల దృష్ట్యా భారత్‌ సహా ప్రపంచ దేశాలన్నీ అప్రమత్తమయ్యాయి. ఇరాక్‌లో ఉంటున్న తమ తమ దేశ పౌరులకు హెచ్చరికలు చేశాయి. ఫిలిప్పీన్స్‌ మరో అడుగు ముందుకేసి.. తమ దేశ పౌరులు తక్షణమే ఇరాక్‌ వదలి రావాలని ఆదేశించింది. ఇందుకోసం కార్గో విమానాలు, ఓడలను ఆ దేశానికి పంపుతోంది. 

ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్‌ క్షిపణి దాడుల తర్వాత ఫిలిప్పీన్స్‌ తప్పనిసరి ఆదేశాలు జారీ చేసింది. తమ దేశం నుంచి ఇరాక్‌కు వెళ్లిన వలస కార్మికులు వెంటనే అక్కడి నుంచి రావాలని ఆదేశించింది. వీరిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు మూడు మిలిటరీ కార్గో విమానాలు, ఓ ఓడను పంపుతున్నట్లు ఫిలిప్పీన్స్‌ రక్షణ మంత్రి తెలిపారు. ఇటీవల ఫ్రాన్స్‌ నుంచి బయల్దేరిన ఓ ఓడ ఇరాక్‌ వెళ్లి కూలీలను తీసుకొస్తుందని అన్నారు. తొలుత వారిని ఖతార్‌, లొరెంజానా తరలించి అక్కడి నుంచి విమానాలు, ఓడల ద్వారా స్వదేశానికి తీసుకొస్తామన్నారు. దాదాపు 1600 మంది ఫిలిప్పినో కార్మికులు ఇరాక్‌లో ఉన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని