అమెరికా దళాలున్న ఇరాక్​ స్థావరంపై దాడి

ఇరాక్‌లోని సైనిక స్థావరాలపై మరోసారి దాడి జరిగింది. అమెరికా సంకీర్ణ దళాలున్న తాజీ స్థావరం వద్ద కత్యుషా రాకెట్లు​పేలినట్లు ఇరాక్​మిలటరీ ప్రకటించింది. అయితే ఈ ఘటనలో..........

Published : 16 Jan 2020 05:02 IST

బాగ్దాద్‌: ఇరాక్‌లోని సైనిక స్థావరాలపై మరోసారి దాడి జరిగింది. అమెరికా సంకీర్ణ దళాలున్న తాజీ స్థావరం వద్ద కత్యుషా రాకెట్లు ​పేలినట్లు ఇరాక్ ​మిలటరీ ప్రకటించింది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. దాదాపు రెండు రాకెట్లు స్థావరం వైపు దూసుకొచ్చినట్లు చూశామని స్థానికులు తెలిపారు. తాజా దాడికి ఇప్పటి వరకూ ఎవరూ బాధ్యత వహింలేదు.  

ఇదే తరహాలో ఆదివారం అల్‌ బలాద్‌ వైమానిక స్థావరంపై ఎనిమిది రాకెట్లు విరుచుకుపడ్డ విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డట్లు ఇరాక్‌ సైన్యం తెలిపింది. అమెరికా-ఇరాన్ మధ్య​ ఉద్రిక్తతలు తీవ్రమైనప్పటి నుంచి ఇరాక్‌లోని అగ్రరాజ్య స్థావరాలపై పలుమార్లు రాకెట్లతో దాడి జరిగింది. ఇరాన్ ​అగ్రశ్రేణి కమాండ్‌ ఖాసీం సులేమానీ హత్య అనంతరం అమెరికా స్థావరాలే లక్ష్యంగా.. ఇరాన్​ క్షిపణి దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడి కూడా ఇరాన్​పనేనని ఆరోపణలు వస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని