ఆ ‘హీరో వైద్యుడి’ మృతిపై దర్యాప్తు

చైనాలో కల్లోలం సృష్టించి ఇప్పటిదాకా 636 మంది ప్రాణాల్ని బలితీసుకున్న కరోనా వైరస్‌ను గుర్తించిన వైద్యుడి మృతిపై చైనా ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. ఈ విషయాన్ని డిసిప్లైన్‌ ఇన్‌స్పెక్షన్‌ కమిషన్‌ వెల్లడించింది. ప్రజల నుంచి వస్తున్న విజ్ఞాపనల .......

Published : 07 Feb 2020 16:32 IST

బీజింగ్‌: చైనాలో కల్లోలం సృష్టించి ఇప్పటిదాకా 636 మంది ప్రాణాల్ని బలి తీసుకున్న కరోనా వైరస్‌ను గుర్తించిన వైద్యుడి మృతిపై చైనా ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. ఈ విషయాన్ని డిసిప్లైన్‌ ఇన్‌స్పెక్షన్‌ కమిషన్‌ వెల్లడించింది. ప్రజల నుంచి వస్తున్న విజ్ఞాపనల దృష్ట్యా ఈ దర్యాప్తు బృందం వుహాన్‌కు వెళ్లి సమగ్ర దర్యాప్తు చేపడుతుందని ఓ ప్రకటనలో పేర్కొంది. 

కరోనా వైరస్‌ లక్షణాలతో ఫిబ్రవరి 1న ఐసీయూలో చేరిన లీ వెన్‌లియాంగ్‌ నిన్న ఉదయం మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించిన విషయం తెలిసిందే. నేత్ర వైద్యుడైన లీ వెన్‌లియాంగ్‌ డిసెంబర్‌ 30న తన వద్దకు వచ్చిన ఓ రోగిలో కరోనా ఆనవాళ్లను తొలిసారి గుర్తించారు. ఈ విషయాన్ని తన మిత్రులకు ఆయన సామాజిక మాధ్యమంలో తెలపడంతో ఇది వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తొలుత ఆయన్ను పోలీసులు అరెస్టు చేయడంపై ప్రజలు మండిపడ్డారు. వైరస్‌ నుంచి ప్రజల్ని కాపాడేందుకు పనిచేసిన ఆయన్ను ఓ హీరోగా కీర్తిస్తున్నారు. ఈ కరోనా వైరస్‌తో మరణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న సమయంలో ఆయన మృతిచెందడం చర్చనీయాంశమవుతున్న వేళ చైనా ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని