ఈవీఎంల భద్రతపై ఆప్‌ నేతలతో కేజ్రీవాల్‌ భేటీ

ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ శనివారం ఎన్నికలు ముగిసిన అనంతరం ఆ పార్టీ సీనియర్‌ నాయకులు సహా వ్యూహకర్త ప్రశాంత్‌కిశోర్‌తో సమావేశమయ్యారు. ఎగ్జిట్‌పోల్స్‌ అన్నీ ఆప్‌కే అనుకూలంగా...

Published : 08 Feb 2020 21:50 IST

దిల్లీ: ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ శనివారం ఎన్నికలు ముగిసిన అనంతరం ఆ పార్టీ సీనియర్‌ నాయకులు సహా వ్యూహకర్త ప్రశాంత్‌కిశోర్‌తో సమావేశమయ్యారు. ఎగ్జిట్‌పోల్స్‌ అన్నీ ఆప్‌కే అనుకూలంగా ఉండడంతో ఈవీఎంల భద్రత గురించి ఆయన వారితో చర్చించినట్లు సమాచారం. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా, సంజయ్‌ సింగ్‌, రాఘవ్‌ చద్దా, గోపాల్‌ రాయ్‌ సహా పలువురు సీనియర్‌ నాయకులు హాజరయ్యారు. దాదాపు అన్ని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు ఆప్‌కే పట్టం కట్టిన విషయం తెలిసిందే. మరోవైపు దిల్లీ భాజపా చీఫ్‌ సైతం ఎగ్జిట్‌ పోల్స్‌పై స్పందిస్తూ.. ‘ఇప్పుడు వెలువడిన అన్ని ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాల రోజున విఫలమవుతాయి. కావాలంటే ఈ ట్వీట్‌ను సేవ్‌ చేసి పెట్టుకోండి. 48 స్థానాలతో దిల్లీలో భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఆ తర్వాత ఈవీఎంలపై ఆరోపణలు చేసేందుకు ప్రయత్నించవద్దు’ అని తివారీ ట్వీట్‌లో పేర్కొనడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని