ప్లకార్డులపై లోక్‌సభలో ఎటూ తేలని చర్చ..

లోక్‌సభలోకి ఎంపీలు ప్లకార్డులు, పోస్టర్లు తీసుకురావడంపై స్పీకర్‌ ఓం బిర్లా అసంతృప్తి వ్యక్తంచేశారు. సభలోకి ప్లకార్డులను అనుమతించడం, సభా కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో వాటిని ప్రదర్శించే అంశంపై చర్చ జరగాల్సిన...........

Published : 10 Feb 2020 23:40 IST

దిల్లీ: లోక్‌సభలోకి ఎంపీలు ప్లకార్డులు, పోస్టర్లు తీసుకురావడంపై స్పీకర్‌ ఓం బిర్లా అసహనం వ్యక్తంచేశారు. సభలోకి ప్లకార్డులను అనుమతించడం, సభా కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో వాటిని ప్రదర్శించే అంశంపై చర్చ జరగాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ సౌగతారాయ్‌ ఆయుర్వేదం బోధన, పరిశోధనా సంస్థ బిల్లు-2020పై మాట్లాడేందుకు లేచిన సమయంలో బెంగాల్‌కు చెందిన కొందరు భాజపా ఎంపీలు బెంగాల్‌లో ‘ప్రజాస్వామ్యాన్ని రక్షించండి’ అని రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు. దీంతో స్పందించిన రాయ్‌.. ఇలాంటివి అనుమతించకూడదని స్పీకర్‌తో అన్నారు. ఈ సందర్భంగా స్పీకర్‌ స్పందిస్తూ..  లోక్‌సభలోకి పోస్టర్లను అనుమతించే అంశంపై చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. వీటిని శాశ్వతంగా అనుమతించకూడదనుకుంటే ప్లకార్డులను తీసుకొచ్చే సభ్యులపై కఠిన చర్యలు తీసుకుందామని చెప్పారు.

 అందుకు లోక్‌సభ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి, రాయ్‌ అంగీకారం తెలిపారు. ఇదే అంశంపై కాంగ్రెస్‌ లోక్‌సభాపక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌధురి అభిప్రాయం చెప్పాలని ఓం బిర్లా అడగ్గా.. ఆయన వేరే విషయంపై మాట్లాడటంతో ‘ప్లకార్డుల’ వ్యవహారంపై ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో చివరకు ఇది ఎటూ తేలలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని