వచ్చే నెలలో వంటగ్యాస్‌ ధరలు తగ్గొచ్చు

వచ్చే నెలలో వంట గ్యాస్‌ ధరలు తగ్గే అవకాశాలున్నాయని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ అన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం నేడు ఛత్తీస్‌గఢ్‌ వచ్చిన ఆయన.. రాయ్‌పూర్‌లోని స్వామి వివేకానంద

Published : 20 Feb 2020 17:54 IST

రాయ్‌పూర్‌: వచ్చే నెలలో వంట గ్యాస్‌ ధరలు తగ్గే అవకాశాలున్నాయని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ తెలిపారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం నేడు ఛత్తీస్‌గఢ్‌ వచ్చిన ఆయన.. రాయ్‌పూర్‌లోని స్వామి వివేకానంద ఎయిర్‌పోర్టులో విలేకరులతో మాట్లాడారు. 

ఈ సందర్భంగా వంట గ్యాస్‌ ధరలు మరింత పెరగనున్నట్లు   వస్తున్న వార్తలపై ధర్మంద్ర ప్రదాన్‌ను అడగ్గా.. ‘ఎల్‌పీజీ ధరలు ఇకపై నిరంతరంగా పెరుగుతాయనే వార్తల్లో నిజం లేదు. అంతర్జాతీయ మార్కెట్ల కారణంగానే ఈ నెలలో గ్యాస్ ధర పెరిగింది. అయితే వచ్చే నెలలో ఈ ధరలు తగ్గే సూచనలు కన్పిస్తున్నాయి’ అని సమాధానమిచ్చారు. చలికాలంలో ఎల్‌పీజీ వినియోగం ఎక్కువగా ఉంటుంది. తద్వారా డిమాండ్‌ పెరిగి అది ధరలపై ప్రభావం చూపిస్తుందని ఆయన అన్నారు. 

అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరగడంతో గతవారం వంట గ్యాస్‌ ధరలు ఒక్కసారిగా ఆకాశన్నంటిన విషయం తెలిసిందే. అయితే వినియోగదారులపై భారం పడకుండా ఉండేందుకు ప్రభుత్వం గ్యాస్‌పై ఇచ్చే సబ్సిడీని కూడా దాదాపు రెట్టింపు చేసింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని