ట్రంప్‌తో పాటు ఇవాంకా కూడా భారత్‌కు..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వెంట ఆయన కుమార్తె ఇవాంకా, అల్లుడు జారెద్ కుష్నర్‌ కూడా భారత పర్యటనకు వస్తున్నారట. ఈ మేరకు అధికారిక వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. ఇవాంకా

Updated : 24 Feb 2020 09:59 IST

దిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వెంట ఆయన కుమార్తె ఇవాంకా, అల్లుడు జారెద్ కుష్నర్‌ కూడా భారత పర్యటనకు వస్తున్నారట. ఈ మేరకు అధికారిక వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. ఇవాంకా దంపతుల రాకను అమెరికా ధ్రువీకరించినట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి. 

ఈ నెల 24, 25న ట్రంప్‌ భారత్‌లో పర్యటించనున్న విషయం తెలిసిందే. అధ్యక్షుడితో పాటు ఉన్నతస్థాయి ప్రతినిధుల బృందం కూడా రానుంది. ఈ బృందంలో కుమార్తె ఇవాంకా ట్రంప్‌, సీనియర్‌ సలహాదారు జారెద్‌ కుష్నర్‌, జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్‌ ఓ బ్రెయిన్‌, ట్రెజరీ సెక్రటరీ స్టీవ్‌ ముచిన్‌, కామర్స్‌ సెక్రటరీ విల్బర్‌ రోస్‌ తదితరులు ఉన్నారు. 

ఫిబ్రవరి 24న ట్రంప్‌, భార్య మెలానియా, ఆయన ప్రతినిధుల బృందం అహ్మదాబాద్‌ చేరుకోనున్నారు. అదే రోజున ప్రధాని మోదీతో కలిసి భారీ రోడ్‌ షోలో పాల్గొననున్నారు. ఆ తర్వాత కొత్తగా నిర్మించిన సర్దార్‌ వల్లభభాయ్‌ పటేల్‌ క్రికెట్‌ మైదానంలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. 24న సాయంత్రం అమెరికా అధ్యక్షుడి కుటుంబం ఆగ్రా చేరుకోనుంది. అక్కడ తాజ్‌మహల్‌ సందర్శన తర్వాత వీరంతా దిల్లీ వెళ్లనున్నారు. ఫిబ్రవరి 25న పలువురు అధికార ప్రతినిధులు, మంత్రులతో ట్రంప్‌ బృందం చర్చలు జరపనున్నట్లు అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని