భారత్‌లో ట్రంప్‌ షెడ్యూల్‌ ఇదీ!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రెండు రోజుల భారత్‌ పర్యటనకు అధికారులు దాదాపుగా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఫిబ్రవరి 24, 25 తేదీల్లో గుజరాత్..

Published : 24 Feb 2020 00:38 IST

దిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రెండు రోజుల భారత్‌ పర్యటనకు అధికారులు దాదాపుగా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఫిబ్రవరి 24, 25 తేదీల్లో గుజరాత్, యూపీ, దిల్లీ ప్రాంతాల్లో ఆయన పర్యటన కొనసాగనుంది. ఫిబ్రవరి 24 (సోమవారం) ఉదయం ట్రంప్‌ భారత్‌ చేరుకోనున్నారు. ఆయన పర్యటన వివరాలను విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. 

ఫిబ్రవరి 24

* ఉదయం 11.40 గంటలకు అహ్మదాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి ట్రంప్‌ చేరుకుంటారు.
* మధ్యాహ్నం 12.15 గంటలకు అహ్మదాబాద్‌లోని సబర్మతి ఆశ్రమాన్ని సందర్శిస్తారు.

* 1.05 గంటలకు మొతెరా స్టేడియంలో ‘నమస్తే ట్రంప్‌’ కార్యక్రమంలో పాల్గొంటారు.

సాయంత్రం 3.30 గంటలకు ఆగ్రా బయల్దేరి 4.45కి చేరుకుంటారు. సాయంత్రం 5.15 గంటలకు తాజ్‌మహల్‌ను సందర్శిస్తారు. 

* సాయంత్రం 6.45కి దిల్లీ బయల్దేరి 7.30 గంటలకు చేరుకుంటారు.

ఫిబ్రవరి 25

* ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో స్వాగత కార్యక్రమానికి హాజరుకానున్న ట్రంప్‌.

అనంతరం 10.30 గంటలకు రాజ్‌ఘాట్‌లో మహాత్మాగాంధీ సమాధి వద్ద నివాళులు.
* 11 గంటలకు హైదరాబాద్‌ హౌస్‌లో ట్రంప్‌, మోదీ మధ్య ఉన్నత స్థాయి సమావేశం. 
* 12.40 గంటలకు ఒప్పందాలపై సంతకాలు/ మీడియా సమావేశం

* సాయంత్రం 7.30 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తో భేటీ

*  రాత్రి 10 గంటలకు అమెరికాకు తిరుగు పయనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని