దేశంలో హింసకు తావులేదు: సోనియా గాంధీ

దిల్లీ: దిల్లీలో జరుగుతున్న హింసాత్మక సంఘటనలపై కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మతం పేరుతో ప్రజలను విడదీయాలని ప్రయత్నించేవారిని ఉపేక్షించేదిలేదని, మహాత్మాగాంధీ పుట్టిన దేశంలో హింసకు తావులేదన్నారు. 

Published : 25 Feb 2020 13:45 IST

దిల్లీ హింసాత్మక ఘటనలపై సోనియా ఆవేదన 

దిల్లీ: దిల్లీలో జరుగుతున్న హింసాత్మక సంఘటనలపై కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మతం పేరుతో ప్రజలను విడదీయాలని ప్రయత్నించేవారిని ఉపేక్షించేదిలేదని, మహాత్మాగాంధీ పుట్టిన దేశంలో హింసకు తావులేదన్నారు. ఈసమయంలో యావత్ దేశ ప్రజలు మత సామరస్యాన్ని కొనసాగించాలని, ముఖ్యంగా దిల్లీ ప్రజలను అభ్యర్థించారు. సోమవారం జరిగిన అల్లర్లలో మరణించిన హెడ్‌కానిస్టేబుల్‌ రతన్‌లాల్‌ కుటుంబానికి సంతాపం తెలియజేశారు. దిల్లీలో జరుగుతున్న హింసాత్మక సంఘటనలు కలవరపెడుతున్నాయని కాంగ్రెస్‌నేత రాహుల్‌గాంధీ ట్విటర్‌లో పేర్కొన్నారు. శాంతియుత వాతావరణంలో నిరసనలు తెలియజేయడమే ఆరోగ్యకర ప్రజాస్వామ్యమని అన్నారు. 

పౌరసత్వ సవరణ చట్టం అనుకూల, వ్యతిరేక నిరసనకారులతో ఈశాన్య దిల్లీలో సోమవారం చెలరేగిన అల్లర్లు మంగళవారం కూడా కొనసాగినట్లు దిల్లీ పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో మొత్తం ఇప్పటివరకూ ఏడుగురు ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని