సైన్యాన్ని పిలిపించండి: కేజ్రీవాల్‌

ఈశాన్య దిల్లీ ఘటనల నేపథ్యంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డొభాల్‌ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షి్స్తున్నారు. పరిస్థితి అదుపులోకి తెచ్చే బాధ్యత కేంద్ర ప్రభుత్వం డొభాల్‌కు.........

Updated : 26 Feb 2020 18:14 IST

దిల్లీ: ఈశాన్య దిల్లీ ఘటనల నేపథ్యంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డొభాల్‌ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పరిస్థితి అదుపులోకి తెచ్చే బాధ్యత కేంద్ర ప్రభుత్వం డొభాల్‌కు అప్పజెప్పిందని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఆయన ప్రధాని, కేబినెట్‌కు నివేదించనున్నారని తెలిపాయి. ఘర్షణలు చోటుచేసుకున్న జఫ్రాబాద్‌, సీలంపూర్‌ సహా మరికొన్ని ప్రాంతాల్లో గత రాత్రి ఆయన పర్యటించారు. స్థానిక నాయకులతో పరిస్థితులపై చర్చించారు. ఈ పరిణామాల నేపథ్యంలో అవసరమైన బలగాల్ని రంగంలోకి దింపామని.. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని అజిత్‌ డొభాల్‌ తెలిపినట్లు ఓ ప్రముఖ జాతీయ మీడియా పేర్కొంది. 

ఘర్షణల నియంత్రణకు పోలీసులు అన్ని రకాల చర్యలు చేపడుతున్నారని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తెలిపారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు సైన్యాన్ని రంగంలోకి దింపాలని కేంద్రాన్ని కోరారు. అవసరమైతే ప్రభావిత ప్రాంతాల్లో నిషేదాజ్ఞలు విధించాలన్నారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు లేఖ రాయనున్నానని ట్విటర్‌లో వెల్లడించారు.

మరోవైపు ఈ ఘటనల్లో చనిపోయిన వారి సంఖ్య 20కి చేరినట్లు గురు తేగ్‌ బహదూర్‌ ఆస్పత్రి సూపరింటెండ్‌ వెల్లడించారు. పరిస్థితిపై కేంద్ర మంత్రివర్గం దిల్లీలో సమీక్షా సమావేశం నిర్వహిస్తోంది. మరోవైపు ఇదే అంశంపై సమావేశమైన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ మృతుల కుటంబాలకు సంతాపం ప్రకటించింది. పార్టీ ఉభయ సభల ఎంపీలు, పీసీసీ అధ్యక్షులు దిల్లీ రావాలని ఆదేశించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని